విజయవాడ

ఘన వ్యర్ధ పదార్థాల నియమాలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 14: జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఘన వ్యర్థ పదార్థాల నియమాలు ఖచ్చితంగా పాటించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో సాలిడ్ వేస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ అమలుపై సమీక్ష జరిపారు. జిల్లాలో ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ నియమాలు-2016 ముఖ్య అంశాలపై సమీక్షించారు. వీటి అమలు తీరుపై ఇకపై 15రోజులకు ఒక్కసారి సమీక్షించాలని ప్రతిపాదించారు. అదేవిధంగా యుఎల్‌బిఎస్‌లో శుద్ధి చేసిన మురుగునీటి వినియోగంపై తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా పర్యావరణ ప్రణాళిక ముసాయిదాలో పేర్కొన్న కార్యాచరణ అంశాలపై చర్చించారు. దీనికి అనుగుణంగా వారం రోజుల్లో ఆయా మున్సిపాలిటీల్లో కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఎస్‌ఎస్‌ఎస్ మురళీ, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణతోపాటు మిగిలిన మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.