విజయవాడ

అంకితభావంతో సేవలందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా అంకితభావం, క్రమశిక్షణ, నీతి, నిజాయతీతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పని చేయాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక అంబేద్కర్ స్టడీ సెంటర్‌లో వారం రోజులపాటు నిర్వహిస్తున్న వార్డు సచివాలయ సెక్రటరీల శిక్షణ తరగతులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను సులభతరం, వేగవంతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు ప్రజలకు అందించడానికే సచివాలయ కార్యదర్శులు పని చేయాలన్నారు. వార్డు సెక్రటరీల శిక్షణ తరగతులు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎటువంటి సిఫార్సులు లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం తమ ప్రభుత్వానికే సాధ్యమన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన సేవలు వారి చెంతకు చేర్చేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకురావడం జరిగిందని, ఇదే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం అని అన్నారు. ఐదు బ్యాచ్‌లుగా వార్డు సెక్రటరీలకు శిక్షణ ఇస్తున్నామని ప్రతి బ్యాచ్‌కూ రెండు వందల నుంచి నాలుగు వందల మంది ఉంటారన్నారు. వివిధ శాఖల నుంచి పదవి విరమణ చెందిన కమిషనర్లు, మెప్మా పీడీలను ట్రైనర్లుగా నియమించామన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు.