విజయవాడ

జిల్లాలో 70శాతం పూర్తయిన ఓటర్ల పరిశీలన, డేటా నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 17: జిల్లాలో ఓటర్ల పరిశీలన, డేటా నమోదు కార్యక్రమం 70శాతం పూర్తయిందని జాయింట్ కలెక్టర్ కే మాధవీలత పేర్కొన్నారు. గురువారం సచివాలయం నుంచి చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ కే విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఓటర్ల పరిశీలన, డేటా నమోదు, చెడిపోయిన ఈవీఎంల తరలింపు తరలింపు, బడ్జెట్ వంటి విషయాలను వివరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో 35,83,136 మంది ఉండగా, 24,37,773 మంది ఓటర్ల పరిశీలన పూర్తి చేసి 68శాతం నమోదు చేశామన్నారు. ఓటర్ల పరిశీలన డేటా నమోదు కార్యక్రమం వచ్చే నెల 18లోగా పూర్తి చేస్తామని స్పష్టం చేయగా, అభినందించిన చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ విజయానంద్ అభినందించారు. స్పెషల్ సమ్మరి రివిజన్ -2020 షెడ్యూల్ తేదీలను మార్పు చేశామని, ఆయా తేదీలను అనుసరించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. డీఆర్‌ఓ ప్రసాద్, ఎస్‌డీసీఎం చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.

దీపావళి టపాసుల విక్రయ కేంద్రాల ఏర్పాటు పరిశీలనకు కమిటీ
విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 17: నగరంలో దీపావళి మందుగుండు విక్రయ కేంద్రాల ఏర్పాటుకు జాయింట్ యాక్షన్ కమిటీని నియమించినట్టు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పీడబ్ల్యూడీ గ్రౌండ్, జింఖానా గ్రౌండ్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసే దీపావళి విక్రయ స్టాల్స్ ఏర్పాటుకు అనువైన వసతుల పరిశీలనకు పోలీస్ రెవెన్యూ, ఫైర్, నగర పాలక సంస్థలకు చెందిన అధికారులు సంయుక్తంగా జేఏసీని నియమించామన్నారు. వీరి సమగ్ర నివేదిక తరువాత ఎన్‌వోసీ ఇచ్చి స్టాల్స్ ఏర్పాటుచేయాలన్నారు. అనంతరం పలువురు అధికారులు పీడబ్ల్యూడీ గ్రౌండ్‌ను పరిశీలించారు.