విజయవాడ

మీడియా స్వేచ్ఛను హరించివేసే జివో938ను ప్రభుత్వం ఉపసంహరించుకావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, అక్టోబర్ 17: ప్రజాస్వామ్యంలో అభిప్రాయం వెల్లడించే హక్కు అందరికి ఉందని, ప్రభుత్వ పరిపాలనపై పత్రికలకు రాసే హక్కు ఉంటుందని ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధిస్తూ కేబినెట్ సమావేశంలో తీసుకొచ్చిన 938 జివో ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు డిమాండ్ చేశారు. గురువారం ఆటోనగర్‌లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాచార శాఖకే పరిమితం చేస్తే, నేడు కొడుకు జగన్ అన్ని శాఖల అధికారులకు కేసులు పెట్టే అవకాశం ఇచ్చారని విమర్శించారు. ఇసుక కొరతతో 5నెలలుగా లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడినా పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్య సంఘాలు, పత్రికల గొంతు నొక్కేందుకు జివో 938ని తీసుకొచ్చారని మండిపడ్డారు. జగన్ మంచిపాలన అందిస్తే ధైర్యంగా సవాల్ చేయాలి తప్ప పరికివాళ్లలా ఆంక్షలు పెట్టకూడదని హితవు పలికారు. ఇప్పటికైనా మీడియా స్వేచ్ఛను హరించివేసే జీవోను జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. జగన్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు బయటకు రాకూడదనే మీడియాపై ఆంక్షలు విధించటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

పోలీసు వీరగాధల చిత్రాలు ప్రదర్శన
విజయవాడ (క్రైం), అక్టోబర్ 17: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పోలీసు కథాంశాలతో నిర్మించిన చిత్రాలను నగరంలో విద్యార్థుల కోసం ప్రదర్శించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న జరుపుకునే అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర పోలీసు కమిషనరేట్‌లో వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలోభాగంగా గురువారం పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో కొత్తపేట పోలీస్టేషన్ పరిధిలోని శ్రీనివాస మహల్ థియేటర్‌లో గరుడవేగ, పటమట పోలీస్టేషన్ పరిధిలోని దుర్గామహల్ థియేటర్‌లో కవచం చిత్రాలను ఉచితంగా ప్రదర్శించారు. నగరంలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన సుమారు 1520 మంది విద్యార్థులు వీటిని ఆసక్తిగా వీక్షించారు.

జీతాల బకాయిల చెల్లింపు కోరుతూ సఫాయి కార్మికుల ఆందోళన
*అడ్డుకున్న పోలీసులు
విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 17: నెలల తరబడి చెల్లించని జీతాలను సత్వరమే చెల్లింపునకు చర్యలు తీసకోవాలంటూ సఫాయి కార్మికులు ఆందోళన చేపట్టారు. గురువారం నగర పర్యటనకు విచ్చేసిన జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సమావేశం నిర్వహిస్తున్న వీఎంసీ కౌన్సిల్ హాల్‌కు చేరుకున్న వీరు సీపీఎం నేత బీ సత్యబాబు నేతృత్వంలో ఆందోళన చేపట్టగా, వారిని అడ్డుకోవడంతో కౌన్సిల్ హాల్ వద్ద కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొంది. ఒకపక్క సఫాయి కార్మికుల పట్ల అధికార యంత్రాంగం చూపుతున్న నిర్లక్ష్యం, అగౌరవ చర్యలపై కమిషన్ చైర్మన్ సమావేశంలో తప్పుపడుతుండగా, అవేమీ పట్టించుకోని నగర పోలీసులు కార్మికులను చెదరగొట్టే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వాస్తవానికి వారు తమ డిమాండ్‌తో కూడిన బ్యానర్ చేతబూని కమిషన్ చైర్మన్ రాకకోసం ఎదురుచూస్తూ శాంతియుతంగా ఉండగా, ఇంతలో పోలీసులు కలుగజేసుకుని వారిని అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో ఇటు పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాము కేవలం వినతిపత్రం అందించేందుకు మాత్రమే వచ్చామని తెలిపినా వినిపించుకోని పోలీసుల తీరు గమనార్హం కాగా, ఇంతలో కర్మచారీల అసోసియేషన్ ప్రతినిధులు పలువురు కలుగచేసుకుని సర్ధిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.