విజయవాడ

ఖరీఫ్ ధాన్యానికి కనీస మద్ధతు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), అక్టోబర్ 17: జిల్లాలో ఖరీఫ్‌లో ధాన్యం పండించిన రైతులకు కనీస మద్ధతు ధర అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత తెలిపారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కోసం 240 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నగరంలోని రైస్‌మిల్లర్స్ సంఘం భవనంలో గురువారం ధాన్యం కొనుగోలుపై సెంటర్ ఇన్‌ఛార్జ్‌లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కస్టోడియన్, సహాయ పౌర సరఫరాల అధికారులతో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై సంబంధిత సిబ్బందికి ఈనెల 24వరకూ దశలవారీగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోజుకు 66 ధాన్యం కేంద్రాలకు సంబంధించి సిబ్బందికి శిక్షణ ఉంటుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల నుండి ధాన్యం కొనుగోలుకు రైతుల రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, ధాన్యం రకాలు, తదితర అంశాలపై శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. రైతుల నుండి కనీస మద్ధతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా సజావుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని సంబంధిత సిబ్బందిని జేసీ మాధవీలత ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు కే రాజ్యలక్ష్మీ, పౌరసరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయం అధికారులు డాక్టర్ మిశ్రా, శర్మ, డిప్యూటీ రిజిస్ట్రార్ దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.

ప్రశ్నాపత్రం లీకేజీపై
ఎందుకు విచారణ చేయలేదు
* ట్విట్టర్‌లో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్న
విజయవాడ(సిటీ), అక్టోబర్ 17: గ్రామ సచివాలయ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను లీకు చేసిన సీఎం జగన్‌ను పట్టుకుని గ్రీకువీరుడంటూ సంబోధించడం నీకు తగునా శకుని మామా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై విచారణ జరిపించేందుకు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలంటూ గురువారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. గ్రామ సచివాలయం పరీక్షలను నిజాయితీగా జరిపించామనే నమ్మకం మీకు ఉంటే లీకేజీపై విచారణ చేయించడానికి మీ తుగ్లక్ సీఎం ఎందుకు భయడుతున్నట్టు శకుని మామా అంటూ నిలదీశారు. మీరు లీక్ చేసిన పేపర్ నాకూ పంపండి.. నేను, మీ తుగ్లక్ సీఎం జగన్‌లు పరీక్ష రాస్తామన్న ఆయన ఎవరికీ ఎక్కువ మార్కులు వస్తాయో చూసుకుందామంటూ ట్విట్టర్‌లో సవాల్ విసిరారు. నేను విసురుతున్న ఈ సవాల్‌కు మీరు సిద్ధమా శకుని మామా అంటూ ట్విట్టర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సీఎం జగన్‌లను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశారు.