విజయవాడ

పోలీసులకు పారదర్శకంగా వారాంతపు సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 17: రాష్ట్ర పోలీసులకు ప్రభుత్వం కల్పించిన వారంతపు సెలవు విధానంలో పారదర్శకత పాటించనున్నట్లు డీజీపీ దామోదర గౌతం సవాంగ్ తెలిపారు. ఇందుకోసం ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దీనిద్వారా పోలీసు సిబ్బందికి వచ్చే నెలలో తమకు రావాల్సిన వారాంతపు సెలవు గురించి ఈ నెల 25వ తేదీనే తెలుసుకో గలుగుతారన్నారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం రాత్రి జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన 13 జిల్లాల నుంచి హాజరైన అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఐటీ కోర్ బృందం, సిబ్బందితో భేటీ అయ్యారు. ఈసందర్భంగా గౌతం సవాంగ్ మాట్లాడుతూ కొత్తగా ప్రవేశపెట్టిన సాఫ్ట్‌వేర్ ద్వారా రాష్ట్రంలోని సిబ్బంది ఎప్పుడు ఎవరు సెలవులో ఉంటారో, వెళతారో అనే విషయాన్ని డీజీపీ డ్యాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షించ గలుగుతారన్నారు. జిల్లాలో ఉన్న సిబ్బంది ఎవరు సెలవులో వెళతారో ఆ జిల్లా అధికారులు పర్యవేక్షించ గలుగుతారని వివరించారు. సమావేశానికి హాజరైన అధికారులు, సిబ్బంది తమకు వారాంతపు సెలవు ఇచ్చిన ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ జీ పాలరాజు, ఎస్పీ రాజశేఖర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

పోలీసు అమరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం
* మంత్రులు కురసాల, వెలంపల్లి నివాళి * మెగా రక్తదాన శిబిరం ప్రారంభం
విజయవాడ (క్రైం), అక్టోబర్ 17: సంస్మరణ అంటే సంతాపం, సానుభూతి కాదని, అమరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని మంత్రి కురుసాల కన్నబాబు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నేతృత్వంలో గురువారం సిటీ ఆర్మ్‌డ్ రిజర్వు గ్రౌండులో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు కురసాల, మరో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తొలుత శాంతికి చిహ్నంగా పావురాలను గాలిలోకి ఎగురవేశారు. ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సమాజంలో సగమైన పోలీసులకు ఇతరులతో పొల్చితే ఎక్కువ బాధ్యతలే ఉన్నాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో, దేశంలో, సమాజంలో ప్రజల మాన ప్రాణ ఆస్తి రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ విధినిర్వహణలో అవసరమైతే ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న వారి త్యాగాలను స్మరించుకుంటూ, స్ఫూర్తికి తీసుకుని ఆదర్శవంతంగా జీవించాలని సూచించారు. పోలీసుల సేవలు అసమానమని కొనియాడారు. నిరంతరం ఒత్తిళ్లతో పనిచేసే పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 24గంటలూ సమాజం కోసం సేవలు అందిస్తున్న పోలీసుల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారాంతపు సెలవు మంజూరు చేశారని, హోంగార్డులకు వేతనం 600 నుంచి 710 రూపాయలకు పెంచారని చెప్పారు. పోలీసు వ్యవస్థ తమ రక్షణ కోసమే ఉందనే అంశాన్ని విస్మరించకుండా ప్రజలంతా వారికి సహకరించాలని మంత్రులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. జాయింట్ పోలీసు కమిషనర్ డి నాగేంద్రకుమార్, డీసీపీలు ఎస్ హరికృష్ణ, వీ హర్షవర్ధనరాజు, ఉదయరాణి, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు, సంఘ సభ్యులు, అధికారులు, సిబ్బంది, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.