విజయవాడ

ముస్లింలు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 17: ఇస్లాం ధర్మంలో విద్యకు అత్యంత విలువైన స్థానం ఉందని, సృష్టిని, సృష్టికర్తను గురించి తెలుసుకోవాలంటే మహిళలకు విద్య తప్పనిసరి అని, విద్యను ఆర్జించడం ప్రతి ముస్లిం విధి అని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌బీ అంజాద్ బాషా అన్నారు. బాలికల విద్య, బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణాపై గురువారం నగరంలో మహితా, ప్లాన్ ఇండియా, మైనార్టీ సంక్షేమ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రాష్టస్థ్రాయి ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రతి మహిళ మన వీరవనితలను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధిలో ముందుకు సాగాలని పిలుపిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకం ద్వారా నిరక్షరాస్యత నిర్మూలనకు, రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రోత్సహించి వంద శాతం అక్షరాస్యత కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా మహిళలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లేందుకు, మహిళా సాధికారత కోసం 50శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారన్నారు. ముస్లిం సమాజంలో రుగ్మతలు తొలగించాలంటే సంపూర్ణ అక్షరాస్యత అత్యంత అవసరమని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా స్పష్టం చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ 18 సంవత్సరాల వయస్సుకు ముందు ఆడపిల్లలకు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాల్య వివాహాలపై దేశవిదేశాల్లో కూడా చర్చ జరుగుతోందన్నారు. ముస్లిం పర్సనల్ లాను కాపాడుటంతో పాటు బయట నుంచి వచ్చే సవాళ్లలపై ఆలోచించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యార్థులను ప్రోత్సహించి ప్రోత్సాహకాలు అందిస్తోందని ఆమె వివరించారు. రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ చైర్‌పర్సన్ జీ హైమావతి మాట్లాడుతూ బాల్య వివాహాలు సమాజాన్ని పీడిస్తున్న ఒక దురాచారంగా ఉన్నాయని, దీనిపై కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 1865 ఉర్దూ మీడియం స్కూళ్లలో 80,480 మంది విద్యను అభ్యసిస్తున్నారని ఆమె వివరించారు. కార్యక్రమంలో మహితా ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్ శేఖర్‌రెడ్డి, కోఆర్డినేటర్ బోడే ప్రసాద్, ప్లాన్ ఇండియా సీనియర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అనితా కుమార్, తదితరులు పాల్గొన్నారు.