విజయవాడ

మరిందరికి లబ్ధి కోసం వైఎస్‌ఆర్ వాహనమిత్ర నిబంధనల సడలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్‌ఆర్ వాహనమిత్ర పథకంలో నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు డీటీసీ ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 31 వరకూ దరఖాస్తుల గడువు పెంచిందన్నారు. తొలిదశ వాహనమిత్ర దరఖాస్తుల స్వీకరణలో డ్రైవర్ల నుంచి చిన్నచిన్న సమస్యలను గుర్తించామని, వాటిని పునఃపరిశీలించి అర్హులైన లబ్ధిదారులందరికీ లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నిబంధనలను సడలించినట్టు తెలిపారు. శనివారం నగరంలోని డీటీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఒకే కుటుంబంలో తండ్రి, తల్లి, కూతురు, సోదరుడు పేరుతో వాహనం కలిగి డ్రైవింగ్ లైసెన్స్ పెద్ద కుమారుడి పేరుతో ఉన్నా ఆర్థిక సాయం అందుతుందని, వాహనం ఉన్నవారి పేరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారి పేరు వేర్వేరు రేషన్ కార్డులోనూ ఉండవచ్చని తెలిపారు. మొదటి దశలో దరఖాస్తు తప్పుగా నమోదై తిరస్కరణకు గురైతే (ఓనర్‌షిప్ డాక్యుమెంట్ కాపీ పెట్టి) కొత్త నిబంధనల మేరకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఏ వాణిజ్య బ్యాంకు అకౌంట్ నంబర్ అయినా ఇవ్వచ్చని తెలిపారు. ఈ నెల 31లోగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా గ్రామ వలంటీర్, బిల్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని, నవంబర్ 8లోగా ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్‌లు దరఖాస్తులను ఆమోదిస్తారని, నవంబర్ 10లోగా లబ్ధిదారుల పేర్లు జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారన్నారు. నవంబర్ 15లోగా లబ్ధిదారుల అకౌంట్లలో 10వేల రూపాయలను జమ చేస్తారని, నవంబర్ 20లోగా జమ చేసిన సొమ్ముకు రసీదు, సీఎం సందేశ పత్రం లబ్ధిదారులకు అందుతాయని డీటీసీ వెంకటేశ్వరరావు వివరించారు.