విజయవాడ

పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిపెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 19: పశ్చిమ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదేశించారు. శనివారం వీఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఇతర ఉన్నతాధికారులతో పశ్చిమ అభివృద్ధిపై సమీక్షించిన ఆయన పలు సూచనలు చేశారు. ప్రధానంగా కొండ ప్రాంతాలైన 27, 30, 31వ డివిజన్లలో తాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు, మెట్లదారులను సత్వరమే మెరుగుపర్చాలన్నారు. కొండప్రాంత డివిజన్లకు పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరుగకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి సరఫరా మెరుగుకు పైప్‌లైన్లకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. స్వాతి థియేటర్ రోడ్డు, ఊర్మిళ సుబ్బారావు నగర్ పార్కు, అభివృద్ధిపై దృష్టి సారించాలని చెప్పారు. సర్కిల్ పరిధిలో డివిజన్ల సమస్యలపై చేసిన సర్వేలో గుర్తించిన అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు అధికారులు ఆయనకు తెలిపారు. కొన్ని పనులు టెండర్ దశలో ఉన్నాయని, మరికొన్ని టెండర్ పూర్తిచేసుకుని పనులు చేపట్టేంకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. మేజర్ అవుట్ ఫాల్ డ్రైన్లలో పారుదల అయ్యే మురుగునీటిని శుద్ధి చేసేందుకు ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కబేళాను ఆధునీకరిస్తున్నామని, గాంధీ హిల్‌ను కూడా పూర్తి సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని అధికారులు మంత్రి వెలంపల్లికి వివరించారు.

కార్మికుల నివాస ప్రాంతాల్లో మెరుగైన వసతులు
* జాతీయ సఫారుూ కర్మచారి కమిషన్ చైర్మన్ * చిట్టినగర్ రెల్లిబస్తీలో పర్యటన
విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 19: నగరంలోని సఫారుూ కార్మికుల నివాస ప్రాంతాల్లో మెరుగైన వసతులు కల్పించాలని జాతీయ సఫారుూ కర్మచారి కమిషన్ చైర్మన్ మన్‌హర్ వాల్జ్భీయ్ జాలా ఆదేశించారు. శనివారం ఆయన నగరంలోని 36వ డివిజన్ మహలక్ష్మీ గుడి, రెల్లిబస్తీలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఆయనకు స్థానిక రెల్లి, సఫారుూ కార్మికులు తమ సమస్యలు విన్నవించారు. ఆయా ప్రాంతాల్లో వీఎంసీ అందిస్తున్న వివిధ వౌలిక సదుపాయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా అందించే వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. నీరు, మురుగు పారుదల, పారిశుద్ధ్యం, తదితర అంశాలపై ప్రత్యేక చొరవ చూపాలని వీఎంసీ అధికారులకు పలు సూచనలు చేశారు. తమకు పింఛన్లు సక్రమంగా అందడం లేదని, రిటైరైన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు మంజూరు చేయడంలో వీఎంసీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు కార్మికులు కమిషన్‌కు తమ గోడు వినిపించారు. స్థానికంగా ఉన్న రూపా బార్, రెస్టారెంట్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దాన్ని వెంటనే తొలగించాలని కోరారు. కమిషన్ చైర్మన్ స్పందిస్తూ తక్షణమే బార్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు. సఫారుూ కర్మచారీలు నివాసముండే ప్రాంతాల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ల విడుదలలో జాప్యం లేకుండా తక్షణం చెల్లింపులు జరపాలని వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌ను ఆదేశించారు. ఇళ్లు లేని వారికి పక్కాగృహాలు మంజూరు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీలకు రుణాల మంజూరులో దళారుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ అర్జునరావు, ఈఈ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.