విజయవాడ

కోతుల దాడి.. నలుగురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 22: కోతులు కరచి నలుగురు గ్రామస్తులు ఆసుపత్రి పాలైన సంఘటన ఇబ్రహీంపట్నంలో జరిగింది. స్థానిక తూర్పు, పడమర, ఫెర్రి, రింగ్ సెంటర్లలో కోతులు మందలుగా సంచరిస్తున్నాయి. నలుగురిని కరవటంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోతుల నివారణకు పంచాయతీ పాలకవర్గం గతంలో రెండు కొండముచ్చులను పెంచింది. స్వీపర్ల ద్వారా వాటిని రిక్షాలో ఎక్కించి ప్రతిరోజూ గ్రామంలో తిప్పటం వల్ల కోతుల బెడద తగ్గిందని, అవి చనిపోవటం, పాలకవర్గం లేకపోవడంతో కోతుల సంచారం మళ్లీ పెరిగిందని గ్రామస్తులు అంటున్నారు. కోతుల బెడద అరికట్టాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు
మద్దతుగా సీఐటీయు ధర్నా
విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 22: తెలంగాణలో 18రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా సీఐటీయు పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యాధరపురం డిపో వద్ద కార్మికులు ధర్నా చేశారు. ముఖ్యఅతిథులుగా సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఏ వెంకటేశ్వరరావు, స్ట్ఫా అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పలుమార్లు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆర్టీసీ సంఘాలు సంప్రదింపులు జరిపినా ఇంతవరకు అమలు చేయకపోవటం బాధాకరమన్నారు. బంగారు తెలంగాణలో కార్మిక హక్కులను కాలరాయటం, 48వేల మంది కార్మికులను విధుల నుండి తొలగించటం, సమ్మె హక్కును హరించివేయటం తగదన్నారు. ఏపీ లోటు బడ్జెట్‌లో ఉన్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి ప్రత్యేక కమిటీని నియమించిన విషయాన్ని కేసీఆర్ గుర్తెరిగి టీఆర్‌టీసీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జీతాలు చెల్లిస్తామని చేసిన బాసలు మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మొండివైఖరిని వీడి కార్మికులు చేపట్టిన న్యాయమైన సమ్మెను చర్చల ద్వారా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయు నగర కార్యదర్శి బోయి సత్యబాబు, అధ్యక్షుడు ఈవీ నారాయణ, ఎల్ మోహన్‌రావు, ఎస్ సుబ్బారెడ్డి, కొండ, ఎం రాజ్యం, తదితరులు పాల్గొన్నారు.