విజయవాడ

2.70 లక్షల మంది ఖాతాల్లో నిధులు జమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: జిల్లాలో వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం కింద ఇంతవరకూ 2.70 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ అయ్యాయని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వైఎస్‌ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం అమలుతీరును సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 6.21 లక్షల రైతుల ఖాతాలు ఉండగా ఇంతవరకూ జరిగిన ప్రగతిని త్వరితగతిన మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వ్యవసాయ, ఉద్యాన, తదితర శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇందుకోసం నియమించిన బృందాలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం రైతుల ఖాతాల పరిశీలనా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. ఈవిషయంలో రైతులను చైతన్యపర్చి వారి బ్యాంకు ఖాతాకు ఆధార్ సీడింగ్ అయ్యేలా చూడాలన్నారు. ప్రజాసాధికార సర్వేలో ఆధార్ సీడింగ్ చేయించుకున్న అర్హులైన రైతులను గుర్తించిన రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు వాటిని సరిచేసి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా రైతులు ఇంకా సాధికార సర్వేలో పేర్లు నమోదు చేయించుకోకపోతే వెంటనే చేయించుకునేలా చైతన్యపర్చాలన్నారు. వైఎస్‌ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం లబ్ధిదారునిగా తిరస్కరణకు కారణాలు, పరిష్కార మార్గాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం లబ్ధి పొందేందుకు అవసరమైన సమాచారం, సహాయం కోసం జిల్లా హెల్ప్‌లైన్ నెం. 08672 - 229883లో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని త్వరితగతిన అమలు చేసేందుకు వ్యవసాయ, ఉద్యానవన, ఏపీఎంఐపీల్లో ఉన్న ఎంపీఈఓ, ఏఈఓలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్-2 కే మోహన్‌కుమార్, వ్యవసాయ శాఖ డీడీ అనిత, ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు దయాకర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.