విజయవాడ

పోస్టుకార్డుపై ఆర్టీసీ చరిత్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 22: పోస్టుకార్డుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చరిత్రను లిఖించటమే కాకుండా విద్యాధరపురం డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, అధికారులు, సూపర్‌వైజర్లు తదితర 750 మంది పేర్లు, వారి కోడ్ నెంబర్లు లిఖించిన విద్యాధరపురం ఆర్టీసీ డిపో కండక్టర్ షేక్ అబ్బాస్ వలీ గిన్నిస్ బుక్ రికార్డు ప్రయత్నం ఫలించాలని సహచరులు అభిలాష వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన షేక్ అబ్బాస్ వలీ విజయవాడలోని విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో గత పదేళ్లుగా కండక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. విధుల్లో చేరిన నాటి నుండి దిగేవరకు నిలువు కాళ్ల మీద పనిచేస్తూ శారీరక అలసటతో ఉండే కండక్టర్లకు భిన్నంగా తాను ఏదో ఒక ప్రత్యేకతను చాటాలనే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో మంగళవారం కండక్టర్ అబ్బాస్ వలీ తాను చేసిన ప్రయత్నాన్ని విలేఖర్ల దృష్టికి తీసుకొచ్చాడు. తన ప్రయత్నానికి ఆర్టీసీ అధికారులు సహకరించాలని కోరినట్లు తెలిపాడు. గతంలో కూడా సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా చిన్న గాలిపటంపై లక్షసార్లు సమైక్యాంధ్ర పదాన్ని రాసినట్లు అబ్బాస్ వలీ తెలిపాడు. ఒంటిపై చొక్కాను చింపి, రాష్ట్రాల విభజన వల్ల ఆర్టీసీకి వచ్చే నష్టాలను సైతం రాసి తన నిరసనను వ్యక్తం చేసినట్లు వివరించాడు.

జిల్లాలో 24గంటల్లో
1098 మి.మీటర్ల వర్షపాతం నమోదు

విజయవాడ, అక్టోబర్ 22: జిల్లాలో గడచిన 24గంటలుగా మొత్తం 1098 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. జిల్లాలో అత్యధికంగా నాగాయలంక మండలంలో 84.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా తిరువూరు, జగ్గయ్యపేట మండలాల్లో 0.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా జిల్లాలో సగటున గత 24గంటల్లో 22మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. చల్లపల్లి మండలంలో 68.6 మిల్లీమీటర్లు, ఘంటసాల 68.2, మచిలీపట్నం 52.6, మొవ్వ 51.2, అవనిగడ్డ 48.6, గూడూరు, పెడన 47.4, ఆగిరిపల్లి 44.2, జి.కొండూరు 39.8, పమిడిముక్కల 39.4, కోడూరు 38.6, మోపిదేవి 38.2, బంటుమిల్లి 36.4, మండవల్లి 34.6, విజయవాడ అర్బన్, రూరల్ మండలాల్లో 30.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుడ్లవల్లేరు మండలంలో 28.2, కలిదిండి 26.8, కృత్తివెన్ను 26.4, ముదినేపల్లి 21.2, కంచికచర్ల 20.8, బాపులపాడు 19.8, కైకలూరు 18.6, చందర్లపాడు 17.6, గన్నవరం 14.8, వీరుళ్లపాడు 14.2, పామర్రు 12.8, పెదపారుపూడి 12.7, ఇబ్రహీంపట్నం 9.4, నందివాడ 8.2, కంకిపాడు 6.8, గుడివాడ 6.6, మైలవరం 6.4, పెనమలూరు 5.4, నందిగామ 5, నూజివీడు 4.6, తోట్లవల్లూరు 4.2, ఉంగుటూరు 2, ఉయ్యూరు 1.8, ముసునూరు 1.4, విస్సన్నపేట 1.2, రెడ్డిగూడెం మండలంలో 0.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.