విజయవాడ

చినుకు పడితే చెరువులా.. ఆర్టీసీ బస్‌డీపో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 22: విద్యాధరపురంలోని ఆర్టీసీ డిపో చేపల చెరువులను మరిపిస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుండి కురిసిన భారీ వర్షానికి డిపో నీట మునిగింది. దీంతో ఆర్టీసీ కార్మికులు బస్సులను తీసుకురావాలన్నా, డిపోలో పని చేసే మహిళా కండక్టర్లు ఆ నీటిలో నుంచి రాకపోకలు సాగించాలంటే ఇబ్బందికరంగా ఉంది. డిపో ఏర్పాటు అయిన నాటి నుంచి సుమారు కొన్ని దశాబ్దాలుగా ఇదే తీరులో మాటమాటికి నీట మునుగుతున్నా, డిపోను ముంపు నుండి ఏ అధికారి పట్టించుకున్న పరిస్థితి లేదు. నగరంలోని లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కట్టడాలు కాలానుగుణంగా మెరకవేసి ముంపు బారి నుండి కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే వేలాది మంది ఉద్యోగులు వరద నీటిలో రాకపోకలు సాగించాల్సి వస్తున్నది. వరద నీరు తగ్గిందంటే బురదలో నడవాల్సి వస్తుంది. రోజుల తరబడి వర్షం నీరు నిలిచిపోవటంతో బస్సులను బయటకు తీసుకురావాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని డీపోలోని కార్మికులు చెబుతున్నారు. ఎంతో విశాలమైన వందలాది బస్సులు రాకపోకలు సాగిస్తున్న ఈ డీపోను మాత్రం పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని సిబ్బంది వాపోతున్నారు.