విజయవాడ

మరింత ఆకర్షణీయంగా ఉద్యానవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 29: నగరంలోని బందర్ రోడ్డులో అంబేద్కర్ - రాఘవయ్య పార్కులను మరింత ఆకర్షణీయంగా రూపొందించాలని వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. అర్బన్ గ్రీనరీ వారు రూపొందించిన డిజైన్ ప్రకారం అభివృద్ధిపర్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. కమిషనర్ మంగళవారం ఆయా పార్కులను సందర్శించి పరిశీలించారు. నగర ప్రజలకు ఆహ్లాదం, ఆనందం, ప్రకృతి రమణీయ దృశ్యాలందించేలా పార్కులను సిద్ధం చేయాలన్నారు. ప్రజలు, సందర్శకుల రాకపోకలకు అనువుగా ఉన్న అంబేద్కర్, రాఘవయ్య పార్కుల అభివృద్ధితో నగరానికి మరింత శోభ వస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పార్కును ఆధునీకరించి మెరుగైన వసతులను అందుబాటులోకి తేవాలన్నారు. ఇందుకు అవసరమైన అంచనాలు, ప్రణాళికలు రూపొందించి సత్వరం ఆయా పనుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో వీఎంసీ ఉద్యానవన శాఖాధికారి జ్యోతి, డీఈఈ కరిముల్లా, అర్బన్ గ్రీనరీ ఆర్కిటెక్ట్ విమల్, అసిస్టెంట్ ఇంజినీర్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

గత పాలకుల నిర్లక్ష్యం వల్లే
ప్రజాసమస్యలు మరింత జటిలం
* సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విమర్శ
విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 29: గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే ప్రజాసమస్యలు జటిలమయ్యాయని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ అన్నారు. ‘గుడ్‌మార్నింగ్ విజయవాడ’ పాదయాత్రలో భాగంగా మంగళవారం ఉదయం గుణదల హనుమాన్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిశీలించారు. స్థానికులు పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన గత నగర పాలకులు అవలంభించిన నిర్లక్ష్యం వల్లనే పలు సమస్యలు తీవ్రతరమై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వైసీపీ పాలనలో ప్రజాసమస్యల పరిష్కారానికి విస్తృత చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రజలు విన్నవించిన సమస్యలన్నింటినీ నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఈఈ ప్రసాద్, డీఈ నారాయణమూర్తి, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు, ఎలక్ట్రికల్ అధికారులు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.