విజయవాడ

మున్సిపల్ అతిథిగృహానికి మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 11: నగర పాలక సంస్థ అతిథిగృహానికి మహర్దశ పట్టింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాసంగా ఈ గెస్ట్‌హౌస్‌ను ఖరారు చేశారు. నగర ప్రజాప్రతినిధుల అవసరాల నిమిత్తం గత రెండు దశాబ్దాల క్రితం ఈ గెస్ట్‌హౌస్‌ను నిర్మించారు. రాష్ట్ర విభజన తరువాత నగరానికి తరలివచ్చిన ప్రభుత్వం యంత్రాంగ అవసరాల నిమిత్తం వీఎంసీకి చెందిన పలు భవనాలు ప్రభుత్వ పరం కాగా, ప్రస్తుతం ఆ జాబితాలోకి మున్సిపల్ గెస్ట్‌హౌస్ కూడా చేరింది. నగరం నడిబొడ్డున బందర్‌రోడ్డులోని వీఎం రంగా విగ్రహం పక్కనున్న మున్సిపల్ గెస్ట్‌హౌస్‌ను ప్రధాన న్యాయమూర్తి నివాస బంగ్లాగా తీర్చిదిద్దేందుకు గాను రూ. 1.84 కోట్ల మంజూరుకు ప్రభుత్వం పాలనామోదం తెలిపింది. కొంత కాలం క్రితం అమరావతికి తరలివచ్చిన రాష్ట్ర హైకోర్టు తన కార్యకలాపాలను ఇక్కడి నుండే కొనసాగిస్తున్న విషయం విదితమే. ప్రధాన న్యాయమూర్తి అధికార నివాసం నిమిత్తం పలు భవనాలను పరిశీలించిన అధికారులు నగరంలోని మున్సిపల్ గెస్ట్‌హౌస్ అందుకు అనుకూలమని భావించి దానినే ఖరారు చేశారు. ఇదిలావుండగా ప్రతినిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉండే బందర్‌రోడ్డును ఆనుకుని ఉండే ఈ బంగ్లా జస్టీస్‌కు కేటాయిస్తే, ఆయన రాకపోకలు సాగించే సమయంలో ట్రాఫిక్‌ను నిలిపివేస్తే, వేలాది మంది వాహన చోదకులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని నగర ప్రయాణికులు పేర్కొంటున్నారు. గతంలో ఇరిగేషన్ కార్యాలయాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్‌గా రూపుదిద్దిన తరువాత, సీఎం రాకపోకల సమయంలో నగర వాహన చోదకులు ఎదుర్కొన్న అవస్థలు మళ్లీ పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దంటూ చర్చోపచర్చలు సాగుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయంపు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రజాసమస్యలకు సత్వర పరిష్కారం
‘డయల్ యువర్ కమిషనర్’లో ప్రసన్న వెంకటేష్
విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 11: డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో ప్రజలు పేర్కొనే సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర ప్రజలు పలువురు తమ సమస్యలపై కమిషనర్‌కు ఫోన్ ద్వారా విన్నవించారు. ఇందుకు స్పందించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రైజర్‌పేట కృపానందం వీధిలో తాగునీటి పైప్‌లైన్ లీకేజీ, పాత రాజరాజేశ్వరీపేట ఎర్రకట్ట దిగువన పైప్‌లైన్ లీకేజీ తోపాటు గతుకుల మయమైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరగా తక్షణమే ఆయా పనులను చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. కండ్రిక ప్రాంతంలో శ్రీను మెడికల్ షాప్ వద్ద గల డ్రైన్ సిల్ట్ తొలగించాలని, 52వ డివిజన్‌లో పారిశుద్ధ్య కార్మికులు సక్రమంగా విధులకు హాజరుకాకపోవడంతో ఉత్పన్నమవుతున్న సమస్యలపై కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా, ప్రజారోగ్యశాఖాధికారులు సత్వరమే ఆయా ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. సింగ్‌నగర్ ఎంగే బేగ్ స్కూల్ లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని, కేదారేశ్వరపేట రైతు బజార్ ప్రాంతంలో రోడ్డుపై అనధికారికంగా ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న తోపుడుబండ్లతో ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిష్కరించాలని, జేడీ హాస్పటల్ రోడ్డులో ఏర్పాటుచేసిన టీ స్టాల్, మోటార్ బైక్ రిపేర్స్ దుకాణాలను తొలగించాలని తదితర సమస్యలను కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అనుపమ, సీఈ మరియన్న, అదనపు కమిషనర్ శకుంతల, డీసీఆర్ వెంకటలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.