విజయవాడ

కమిషనరేట్ ‘స్పందన’కు 144 ఫిర్యాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 11: నగర పోలీసు కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 144 ఫిర్యాదులు అందాయి. స్పందనలో జాయింట్ పోలీసు కమిషనర్ డి నాగేంద్రకుమార్ పాల్గొని బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వచ్చిన పిటిషనర్లతో స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. కమిషనర్ కార్యాలయంలో జరిగిన స్పందనకు 132 ఫిర్యాదులు రాగా, కమిషనరేట్ పరిధిలోని జోన్లు, సర్కిల్ కార్యాలయాలు, పోలీస్టేషన్లలో 12 ఫిర్యాదులు అందాయి. మొత్తం 144 ఫిర్యాదుల్లో ఎక్కువగా 42 భార్యభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించినవి, 38 నగదు లావాదేవీలు, 32 సివిల్ వివాదాలు, 6 అద్దె వివాదాలు, 6 వివిధ మోసాలకు సంబంధించినవి కాగా, మిగిలినవి ఇతర ఫిర్యాదులు ఉన్నాయని అధికారులు వివరించారు.

వీఓఏల తొలగింపు సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలి

విజయవాడ, నవంబర్ 11: వీఓఏలకు నాలుగు రోజులుగా తమ ఉద్యోగాలను కొనసాగించాలని వీఓఏలు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో సోమవారం ప్రభుత్వం రూ. 10వేలకు వేతనం పెంచుతూ జీఓ ఎంఎస్ నంబర్ 699ను జారీ చేసినందుకు సీఐటీయు అనుబంధ ఏపీ వెలుగు, వీఓఏల ఉద్యోగుల సంఘం ధన్యవాదాలు తెలిపింది. అయితే మూడేళ్ల సర్వీసు పూర్తయిన 27,797 మందిని తొలగించాలంటూ సెర్చ్ సీఈఓ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించక పోవడం వీఓఏలను తీవ్ర నిరాశకు గురిచేసిందని, తక్షణం ఉద్యోగాల తొలగింపు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని యూనియన్ డిమాండ్ చేసింది. వీఓఏల తొలగింపు సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి వెలగపూడి సచివాలయంలో అన్ని జిల్లాల నాయకత్వం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం కాలపరిమితి సర్క్యులర్‌ను వెనక్కు తీసుకునేవరకు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ఆందోళనలు కొనసాగించాలని ఏపీ వెలుగు వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టీ మద్దిలేటి, కే ధనలక్ష్మి పిలుపునిచ్చారు.