విజయవాడ

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు మరింత నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 11: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు తావులేకుండా మరింత నిఘా పెంచుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ చెప్పారు. క్యాంపు కార్యాలయంలో ఇసుక నిల్వలు, సరఫరా, ఎన్‌ఫోర్స్‌మెంట్, తదితర అంశాలపై సోమవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వరద నీరు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇసుక తవ్వకం పనులు ముమ్మరం చేయాలన్నారు. వినియోగదారుల నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక కోసం బుకింగ్ జరిగాక ఎలాంటి ఆలస్యం లేకుండా సరఫరా చేయాలన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నిరోధానికి తీసుకున్న చర్యల్లో భాగంగా ఇంతవరకు 632 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 347 వాహనాలను సీజ్ చేయగా వాటిలో 140 తెలంగాణకు ఇసుక రవాణా చేస్తున్న వాహనాలు ఉన్నాయన్నారు. సీజ్ చేసిన వాహనాల్లో నాలుగు జేసీబీలు, కొన్ని లారీలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దుల్లో కచ్చితమైన తనిఖీలు ఉండాలన్నారు. సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు పోలీసులతో కలిసి ఇసుక అక్రమ రవాణాకు తావులేకుండా తనిఖీలు చేయించాలన్నారు. జిల్లాలో 24గంటలూ పని చేసే 6ప్రత్యేక సంచార నిఘా బృందాలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. ఈ బృందాలు సంచరించే ప్రాంతాల్లో లోటుపాట్లు గుర్తిస్తే సంబంధిత సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఇసుక రవాణా చేసే వాహనాలకు తప్పనిసరిగా ఈ నెల 20లోగా జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం 23వేల టన్నుల ఇసుక స్టాక్ పాయింట్లో నిల్వ ఉండగా 6వేల టన్నుల విక్రయాలు జరగ్గా 17వేల టన్నులు నిల్వ ఉందన్నారు. అయితే కాల్‌సెంటర్‌కు కొందరు ఫోన్ చేసి ఆయా ప్రాంతాల్లో స్టాక్ లేదని ఫిర్యాదు చేస్తున్నారని, స్టాక్ ఉన్నప్పటికీ సరఫరాలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని ప్రశ్నించారు. ఈ దృష్ట్యా గుడివాడ, అవనిగడ్డ, తదితర ప్రాంతాల్లో ఇసుక స్టాక్ పాయింట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక స్టాక్ ఉన్నంతమాత్రాన సరిపోదని, అది వినియోగదారునకు చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, సబ్ కలెక్టర్లు హెచ్‌ఎం ధ్యానచంద్ర, స్వప్నల్ దినకర్, అదనపు ఎస్పీ ఎం సత్యబాబు, గుడివాడ ఆర్డీఓ సత్యవాణి, గనుల శాఖ డీడీ ఏ శ్రీనివాస్ కుమార్, ఏపీఎండీపీ అధికారి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.