విజయవాడ

మాన్యుఫ్యాక్చరింగ్, భవన నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), నవంబర్ 17: మానుఫ్యాక్చరింగ్, భవన నిర్మాణ రంగంలో నేడు ఉద్యోగ అవకాశాలు అపారంగా ఉన్నాయని, మిగతా రంగాలలో కూడా ఉద్యోగాలు కల్పించేలా హెచ్‌ఆర్ విభాగం తగిన విధంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అమరావతి హెచ్‌ఆర్ ఛాప్టర్ ఫౌండర్ ప్రెసిడెంట్ తెల్లం రవితేజ పేర్కొన్నారు. నగరంలోని లబ్బీపేటలో అమరావతి హెచ్‌ఆర్ ఛాప్టర్ సభ్యుల మొదటి సమావేశం కాన్‌క్లీవ్ -2019 పేరుతో ప్రత్యేక కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ వివిధ కంపెనీలు, పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, రిక్రూట్‌మెంట్‌లో అవలంభించాల్సిన విధానాలు, ఉద్యోగంలోకి తీసుకునే ముందు వ్యక్తిని ఏవిధంగా సిద్ధం చేయాలనే అంశాలపై ఈ సెమినార్‌లో ఆయన వివరించారు. ప్రధానంగా ఆర్ట్ఫిషీయల్ ఇంటలిజెంట్, మేషీన్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియామకాలు చేస్తున్నారని ఏ విధంగా చేస్తున్నారనే దానిపై చర్చించడంతో పాటు ఏయే కంపెనీలు ఎటువంటి విధానాలు అవలంభిస్తున్నాయో వివరంగా తెలిపారు. ప్రతిభ, సామర్థ్యం గల వారిని ఉద్యోగ అవకాశాలకు ఎంపిక చేసే సమయంలో సైకోమెట్రిక్ అసెస్‌మెంట్ విధానాన్ని ఏవిధంగా అవలంభిస్తున్నరో యువ హెచ్‌ఆర్‌లకు వివరించారు. అలాగే పలువురు సీనియర్ హెచ్‌ఆర్‌లు యువ హెచ్‌ఆర్‌లకు పలు సూచనలను, సలహాలను అందించారు. ఈ కాన్ఫరెన్స్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విశాఖపట్నం, బెంగుళూరు నుండి వివిధ కంపెనీల హెచ్‌ఆర్ మేనేజర్లు, హెచ్‌ఆర్ డైరెక్టర్లు 110 మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమరావతి హెచ్‌ఆర్ ఛాప్టర్ కో ఫౌండర్ సాయి నాందేడ్, పలు కంపెనీల హెచ్‌ఆర్ మేనేజర్లు, హెచ్‌ఆర్ డైరెక్టర్లు, యువ హెచ్‌ఆర్‌లు, ఎంబీఎ విద్యార్థులు పాల్గొన్నారు.