విజయవాడ

బాలల స్నేహపూర్వక వేదికగా బస్టాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 17: విజయవాడ బస్టాండ్‌ను బాలల స్నేహపూర్వక వేదికగా తీర్చిదిద్దాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్మన్ బీవీఎస్ కుమార్ తెలిపారు. నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో సమాచార కేంద్రం వద్ద ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, మరియు చైల్డ్‌లైన్ -1098, ఏపీఎస్ ఆర్టీసీ సహకారంతో నవంబర్ 14 నుంచి 20వరకూ నిర్వహిస్తున్న బాలల హక్కుల పరిరక్షణ మరియు చైల్డ్‌లైన్ దోస్తీ వారోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాలలు వివిధ కారణాలతోను, ఎన్నో సమస్యలతో ఇంటి నుంచి బయటకు రావడం, తప్పిపోవడం, ఆపదలో ఉండటం, వీధి బాలలు, బాలల అక్రమ రవాణా, తదితర కారణాలు ఏమైనా బస్టాండ్ ఆవరణలో కనిపిస్తే వారిని ఆదరించి రక్షించి చైల్డ్‌లైన్ -1098కు సమాచారం ఇవ్వాలని, తద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చన్నారు. ఆర్టీసీ విజయవాడ బస్టాండ్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ బీ రామమోహనరావు ఆర్టీసీలోని ప్రతి ఉద్యోగికి బాలల హక్కుల పట్ల, ఆపదలో ఉన్న బాలల రక్షణ పట్ల చైతన్యం, అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమంలో దోహదపడుతుందన్నారు. బీఐఆర్‌డీఎస్ సంస్థ సెక్రటరీ కోటే ప్రకాష్ మాట్లాడుతూ బాల్యం - విద్య- ఆనందం - ఆరోగ్యం అందరికీ అందించడం పెద్దల బాధ్యతగా గుర్తించాలన్నారు. బాల్య వివాహాలు, బాలలపై హింస, లైంగికదాడులను సమష్టి కృషితో నిర్మూలించాలన్నారు. దేశ వ్యాప్తంగా బాలల సహాయ వాణి చైల్డ్‌లైన్ 1098 తక్షణ సాయం అందిస్తుండటం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో భాగంగా చైల్డ్‌లైన్ సే దోస్తీసురక్షా బంధన్‌ను కట్టి స్వాగతం పలికారు. నవజీవన్ బాల భవన్ ముద్రించిన బాలల వారోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేసి సంతకాల బ్యానర్‌పై సంతకాలు చేశారు. ఈకార్యక్రమంలో కృష్ణలంక ఎస్‌ఐ శ్రీనివాస్, సీడబ్ల్యూసీ సభ్యులు ఎల్ ఫ్రాన్సిస్, చైల్డ్‌లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ అవర రమేష్, సెంటర్ కో-ఆర్డినేటర్ ఎస్ జాకబ్, చైల్డ్‌లైన్ 1098 సిబ్బంది ఎం ప్రభాకర్, ఎస్ అబ్రహాం, వై స్వరూపరాణి, ఈ రాజ్యలక్ష్మీ, పీ రవి తదితరులు పాల్గొన్నారు.