విజయవాడ

రైతు సంక్షేమం, అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంకిపాడు, నవంబర్ 17: రైతు సంక్షేమానికి, అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని దేవాదయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని ఈడుపుగల్లు గ్రామంలో ఆదివారం ఏరువాక కార్యక్రమంలో భాగంగా మంత్రి వెల్లంపల్లి వరికోత కోసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని ఐదేళ్లలో ఏఒక్క రైతుకు పూర్తిగా మాఫీ చేయలేదని ఆరోపించారు. చంద్రబాబుకు రైతులపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చినమాట ప్రకారం రైతులకు రైతుభరోసా అందజేశారని తెలిపారు. త్వరలో కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు అందజేసి రైతుభరోసాని అమలు చేస్తామన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రకృతి సహకరించి వర్షాలు కురవటంతో నదులు, కాల్వలు, చెరువులు నిండుగా ఉన్నాయన్నారు. రెండోపంట వేసుకోవటానికి కూడా నీరు పుష్కలంగా అందుబాటులో ఉందని తెలిపారు. ఈకార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, వైసీపీ నాయకులు మాదు వసంతరావు, కుటుంబరావు, మద్దాలి రామచంద్రరావు, బాకీబాబు, నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.