విజయవాడ

ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, నవంబర్ 17: ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టి ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పిద్దామని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. కానూరు పరిధిలోని మహదేవపురంలోని సుధాకాలనీ నందు కల్యాణ మండపం నందు స్వచ్ఛసేవాకార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ రహిత గ్రామాల నిర్వహణకు వ్యాపారస్థులకు అవగాహన సదస్సు అదివారం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్నో నష్టాలు, అనర్థాలు జరుగుతున్నాయని వాటి నివారణకు పూర్తిస్థాయి నిషేధమే పరిష్కారమని ఆయన అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటే అందుకు వ్యాపారుల సహకారం ఎంతో అవసరమన్నారు. కాగితపు ప్లేట్స్, గ్లాసులు శ్రేయస్కకరం అని, వాటిని వాడిపడేసినా మట్టిలో కలిసిపోతాయన్నారు. కానీ ప్లాస్టిక్ ప్లేట్లు మాత్రం కొన్ని వందల ఏళ్లు గడిచినా కలిసిపోవటం కష్టమన్నారు. ఈకార్యక్రమంలో జడ్పీసీఈవో సూర్యప్రకాశరావు, డీపీవో అరుణ, మండల స్పెషల్ అధికారి సునీల్, తహసీల్దారు జీ భద్రునాయక్, వ్యాపారులు పాల్గొన్నారు.