విజయవాడ

సీఎం నివాసముంటున్న తాడేపల్లిలోనూ కరెంట్ కోతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), నవంబర్ 18: విద్యుత్ కొనుగోళ్ల అంశంలో కేంద్రం ఎన్ని మొట్టికాయిలు వేసినా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు జగన్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాశారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. సీఎం నివాసముంటున్న తాడేపల్లిలోనే ఇప్పుడు కరెంట్ కోతలు ఉంటున్నాయంటే పాలన ఎలావుందో అర్థమవుతోందని సోమవారం ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. అఖిలపక్ష సమావేశంలో చీవాట్లు తిన్న తరువాత మీ ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలం విజయసాయిరెడ్డీ అంటూ ట్వీట్ చేశారు. దోమలు, ఎలుకల నివారణకు అంత ఖర్చా అని వితండ వాదన చేసిన మీరు విషజ్వరాలతో ప్రజల్ని పొట్టనపెట్టుకున్నారని విమర్శించారు. సోలార్ విద్యుత్‌కి అంత రేటా అంటూ ఇప్పుడు విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఎద్దేవా చేశారు. మీ ప్రభుత్వం తీసుకుంటున్న చెత్త నిర్ణయాల వల్ల పెట్టుబడి పెట్టడానికి విద్యుత్ కంపెనీలు ముందుకు రావడం లేదన్నారు. జగన్ పేరు చెప్పగానే పెట్టుబడిదారులు మాయమవుతున్నారని విమర్శించారు. మీ పాలన చూశాక ఏకంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తెస్తోందని, మీది ఎంత గొప్ప పాలనో దీంతో అర్థమవుతోందన్నారు. విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు ఇబ్బంది పడకుండా జే-ట్యాక్స్ నుండి రక్షణ కల్పిస్తూ కేంద్రం ప్రత్యేక చట్టం తీసుకొస్తోందన్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందే క్రమంలో పునరుత్పాదక విద్యుత్ రేట్లు తగ్గుతాయని మీకు తెలియకపోవడం అమాయకత్వమని మాత్రం అనుకోలేం అంటూ ట్విట్టర్‌లో సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ట్యాగ్ చేస్తూ వెంకన్న కామెంట్ చేశారు.
జగన్ వైన్ ఎంతో కాస్ట్ గురూ!
సీఎం జగన్ అన్న మద్యం దుకాణాల్లో సరుకు చాలా కాస్ట్లీ గురూ!.. అంటూ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. సీసా మీద ఎమ్మార్పీ కంటే రూ. 30లు ఎక్కువ వసూలు, 8 దాటిన తరువాత షట్టర్ కొడితే మరో రూ. 30 బాదుడేనన్నారు. గ్రామాల్లో పుట్టగొడుగుల్లా బెల్టుషాపులు, వైకాపా సారా స్థావరాలు పుట్టుకొస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అయిపోయిందా? బెల్టు షాపులు రద్దయిపోయాయా? అంటూ నిలదీశారు. ఇన్ని చెబుతున్న సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళదామో మీరే నిర్ణయించండని ఆయన సవాల్ విసిరారు. జగన్ వచ్చినా, లేదా మీరు వచ్చినా పర్వాలేదని, ఒక్క మహిళ అయినా మద్యపాన నిషేధం అమలవుతోందని అంగీకరిస్తే మీపై విమర్శలు చేయడం మానుకుంటానంటూ ట్విట్టర్‌లో వెంకన్న సవాల్ విసిరారు.

ఫుట్‌బాల్ జూనియర్ బాలుర టోర్నీ ప్రారంభం
విజయవాడ (ఎడ్యుకేషన్), నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైల్వే మైదానంలో రాష్టస్థ్రాయి జూనియర్ బాలుర ఫుట్‌బాల్ టోర్నమెంట్ సోమవారం ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌ను జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. సాయంత్రం మ్యాచ్‌లను ఎమ్మెల్యే మల్లాది విష్ణు క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో ఫుట్‌బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే గోపాలకృష్ణ, ఉపాధ్యక్షుడు షేక్ మహబూబ్ హుస్సేన్, సంయుక్త కార్యదర్శి గిరిరావు, తదితరులు పాల్గొన్నారు. సోమవారం మ్యాచ్‌ల ఫలితాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జట్టుపై 1-0 తేడాతో కృష్ణా, కర్నూలుపై 1-0 తేడాతో చిత్తూరు, శ్రీకాకుళంపై 7-0 తేడాతో విశాఖపట్నం, కడపపై 1-0 తేడాతో అనంతపురం విజయం సాధించాయి. గుంటూరు, నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది.