విజయవాడ

లీగ్ దశకు కృష్ణా వర్సిటీ బాస్కెట్‌బాల్ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), నవంబర్ 18: స్థానిక ఆంధ్ర లాయోల కళాశాల ఆధ్వర్యంలో కృష్ణా విశ్వవిద్యాలయం అంతర కళాశాలల బాస్కెట్‌బాల్ పురుషుల టోర్నమెంట్ సోమవారం ప్రారంభమైంది. ఆంధ్ర లాయోల కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ విక్టర్ ఇమ్మానుయేల్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహించారు. సోమవారం జరిగిన మ్యాచ్‌లలో నాకౌట్ దశ నుండి నాలుగు కళాశాలల జట్లు లీగ్ దశకు అర్హత సాధించాయి. వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆంధ్ర లాయోల కళాశాల, డీఎఆర్ కళాశాల, కేబీఎన్ కళాశాలల జట్లు లీగ్ దశకు చేరుకున్నాయి. మంగళవారం వర్సిటీ జట్టును ఎంపిక చేయనున్నారు. ప్రారంభ కార్యక్రమంలో వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డా. ఎన్ శ్రీనివాసరావు, టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి జేవీఎన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. నాకౌట్ మ్యాచ్‌లలో ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై 45-22 తేడాతో డీఎఆర్ కళాశాల, నోబుల్ కళాశాలపై 31-4 తేడాతో ఆంధ్ర లాయోల కళాశాల, పీబీ సిద్ధార్థ కళాశాలపై 30-12 తేడాతో కేబీఎన్ కళాశాల గెలుపొందాయి. అనంతరం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో డీఎఆర్ కళాశాలపై 63-44 తేడాతో ఆంధ్ర లాయోల కళాశాల, కేబీఎన్ కళాశాలపై 36-18 తేడాతో వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విజయం సాధించాయి.

బస్టాండ్‌లో ప్లాస్టిక్ సీసాల
క్రషింగ్ మిషన్ ఏర్పాటు
విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 18: పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్ నియంత్రణ పౌరులంతా బాధ్యతగా గుర్తించాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు కోరారు. వేమూరి బలరామ్ సౌజన్యంతో పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ బాటిల్స్ క్రషింగ్ మిషన్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పరిసరాలు కలుషితం అవుతున్నాయని, ప్రజలకు పరిశుభ్రమైన పరిసరాలను అందించడంలో భాగంగా, పర్యావరణ సమతుల్యత కోసం ఏర్పాటు చేసిన క్రషింగ్ మిషన్‌ను అందరూ వినియోగించుకోవాలన్నారు. ప్రయాణంలో ఖాళీ అయిన వాటర్, ఇతర బాటిళ్లను ఎక్కడంటే అక్కడ కాకుండా బస్టాండ్ ఆవరణలోని క్రషింగ్ మిషన్‌లో వేయాలని సూచించారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్లాస్టిక్ క్రషింగ్ మిషన్లు భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్లు విజయవాడ శ్రీరాములు, జాన్ సుకుమార్, డెప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ జీవన్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.