విజయవాడ

వీఎంసీ స్పందనకు 24 అర్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 18: నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తమ సమస్యలపై పలువురు సుమారు 24 అర్జీలను అధికారులకు అందించారు. వీఎంసీలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అర్జీలు స్వీకరించారు. టౌన్ ప్లానింగ్‌కు సంబంధించి 12, ఇంజినీరింగ్-3, రెవెన్యూ-2, ప్రజారోగ్యం-1, ఉద్యానవన శాఖ-1, ఎస్టేట్-4, యూసీడీ-1 విభాగాలకు సంబంధించిన సమస్యలపై అర్జీలు వచ్చాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. సత్యనారాయణపురం శ్రీనగర్ కాలనీ 2వ లైన్ నివాసులు తమ కాలనీ రోడ్డుపై ఉన్న పెద్ద చెట్టు వల్ల ఫ్లోరింగ్ దెబ్బతినడమే కాకుండా గోడలకు పగుళ్లు వస్తున్నాయని, దాన్ని తొలగించాలని కోరారు. అమరావతి డిజిటల్ ఎలక్ట్రికల్ డీలర్స్ అసోసియేషన్ వారు ఎన్టీఆర్ కాంప్లెక్సులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, నేరాలను అరికట్టాలని, చిట్టినగర్ బంగారయ్య కొట్లు కొండ ప్రాంతంలో ఏర్పాటు చేసిన జియో టవర్ రేడియేషన్ వల్ల స్థానికులు అనారోగ్యం పాలవుతున్నందున దాన్ని తొలగించాలని, విద్యాధరపురం సిమెంట్ రోడ్డులో ఏర్పాటు చేస్తున్న 2వ సెల్‌టవర్‌ను నిలుపుదల చేయాలని, బీఆర్‌పీ రోడ్డు, సీఎస్‌ఐ చర్చి వెనుక జరుగుతున్న ఆక్రమణను అడ్డుకోవాలని, 43వ డివిజన్‌లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాల అవసరాల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, బుడమేరు కరకట్ట విజయదుర్గనగర్‌లో అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయాలని, తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారు. అదనపు కమిషనర్ కే శకుంతల, డీసీఆర్ వెంకటలక్ష్మి, ఎస్‌ఈ జేవీ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.