విజయవాడ

‘స్పందన’ ఫిర్యాదులపై జాప్యం చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 18: స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై జాప్యం పనికిరాదని నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు అన్నారు. ప్రతి వారం కమిషనరేట్‌లో నిర్వహించే స్పందన దృష్టికి వస్తున్న ఫిర్యాదుల పట్ల అధికారులు త్వరితగతిన స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. తద్వారా బాధితులకు సత్వర న్యాయం అందించాలని సూచించారు. కమిషనరేట్‌లో సోమవారం జరిగిన స్పందనకు 154 ఫిర్యాదులు అందాయి. పోలీసు కమిషనర్ కార్యాలయంలో జరిగిన స్పందనకు 143 ఫిర్యాదులు రాగా.. పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు స్వయంగా అర్జీలు స్వీకరించారు. బాధితుల నుంచి సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. పిటిషన్లు పరిశీలించాక వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కమిషనరేట్ పరిధిలోని జోన్లు, సర్కిల్ కార్యాలయాలు, పోలీస్టేషన్లలో జరిగిన స్పందనకు వచ్చిన 11 ఫిర్యాదులతో కలిపి మొత్తం 154 ఫిర్యాదులు అందాయి. ఆయాచోట్ల స్పందనకు వచ్చిన పిటిషన్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుని వారంలోగా నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులు, పోలీస్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ ఇప్పటివరకు 18 స్పందన సోమవారాలు జరిగాయని, ఫిర్యాదులకు సంబంధించి ఆస్తి, స్థల తగాదాలుంటే ప్రీలిటిగేషన్ కౌనె్సలింగ్ ఫోరానికి పంపి సంబంధిత అధికారుల ద్వారా ఫిర్యాదుల పరిష్కారానికి సిఫార్సు చేస్తున్నామని చెప్పారు. క్రిమినల్ కేసులకు సంబంధించి సంబంధిత పోలీస్టేషన్ అధికారులకు పంపి వారంలోగా పరిష్కరించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇదిలావుండగా కమిషనరేట్‌లో అందిన మొత్తం 154 ఫిర్యాదుల్లో ఎక్కువగా 47 నగదు లావాదేవీలకు సంబంధించినవి కాగా, 40-్భర్యాభర్తలు, కుటుంబ కలహాలు, 27-సివిల్ తగాదాలు, 4-అద్దె వివాదాలు, 12-మోసాలకు సంబంధించినవి ఉన్నాయి. మిగిలినవి ఇతర వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులని అధికారులు వివరించారు.