విజయవాడ

స్విమ్మర్ తులసీ చైతన్యకు సీపీ అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 19: స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ తులసీ చైతన్యను పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు అభినందించారు. 2012లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరిన తులసీ చైతన్య స్విమ్మింగ్‌లో అసాధారణ ప్రతిభ ప్రదర్శించి ఎన్నో అవార్డులు, రివార్డులు, పతకాలు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో సాధించి సత్తా చాటారు. దీంతో పోలీసుశాఖలో కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్‌గా అనతి కాలంలోనే పదోన్నతితోపాటు ఇంక్రిమెంట్లు కూడా అందుకున్నారు. తాజాగా ఈ ఏడాది సెప్టెంబర్ 16న యుఎన్‌ఏలోని అత్యంత ప్రమాదకరమైన క్యాటలీనా ఛానెల్‌ను ఈది విజయం సాధించిన చైతన్య నవంబర్ 3న గోవాలో జరిగిన నేషనల్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. దీంతో పోలీసు కమిషనర్ తులసీ చైతన్యను అభినందించి దేశానికి, రాష్ట్రానికి, నగర పోలీసుశాఖకు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ప్రతీ ధాన్యం గింజ కొనుగోలు కేంద్రాలకు చేరాలి
* అధికారులకు జేసీ మాధవీలత ఆదేశం
విజయవాడ (క్రైం), నవంబర్ 19: జిల్లాలో ఖరీఫ్ పంట కాలంలో రైతు పండించిన ప్రతీ ధాన్యం గింజా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరేల సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై ఏఎస్‌ఓ, సిఎస్‌డిటిలతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేసిన 264 కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా రైతుల వివరాలను రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. మధ్య దళారుల ప్రమేయం లేకుండా రైతులు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే తమ ధాన్యాన్ని విక్రయించుకునేలా అవగాహన పరచాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైసుమిల్లులకు తరలించాలన్నారు. ఇప్పటికే ఖరీఫ్ ధాన్యం కొనుగోలు, కేంద్రాల నిర్వహణపై ఇప్పటికే శిక్షణ అందించమని దాన్ని తూచ తప్పకుండా పాటించాలన్నారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజర్ ఐ రాజ్యలక్ష్మీ, డిఎస్‌ఓ మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.