విజయవాడ

మీ రాతకోతలు పరమ రోత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), నవంబర్ 19: మీరు చేసే వ్యాఖ్యలు, మీ పేపర్లో రాసే రాతలు, మీ చేతలు రాష్ట్ర ప్రజలకు రోత పుట్టిస్తున్నాయని సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. నాడు చేసిన తప్పులను మాత్రం ఒక్కొక్కటిగా ఒప్పుకుంటున్నారుగా.. అంటూ మంగళవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో మీకు నిద్రపట్టక ఫినాయిల్ రాతలు రాయించారుగా విజయసాయిరెడ్డీ అని విమర్శించారు. తెలుగును రక్షించండని గగ్గోలు పెట్టారుగా అని గుర్తుచేశారు. ఇప్పుడు అదే ఫినాయిల్ పత్రికలో పేదల పిల్లలకు ఇంగ్లీష్ విద్య వద్దా అని విరుచుకుపడుతున్నారని ఎద్దేవా చేశారు. డబుల్ స్టాండర్డ్స్ పక్కన పెట్టి ఒక విధానంపై నిలబడమని మీ సీఎం జగన్‌కు సలహా ఇవ్వండని విజయసాయిరెడ్డికి సూచించారు. దేవుడి స్క్రిప్టో, లేక యాదృచ్ఛికంగా జరుగతున్నాయో తెలియదుకానీ మీరు చేసిన తప్పులన్నీ మీరే స్వయంగా ఒప్పుకుంటున్నారని అన్నారు. ట్రైన్లు తగలబెట్టి కులాల మధ్య చిచ్చుపెట్టిన సంఘటన, పంటలు తగులబెట్టి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రచ్చ చేసిన అంశం మళ్లీ తెర పైకి తెచ్చారుకదా అన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టాలని మీ ఆస్థాన విద్వాంసులను ప్రయోగించలేదా అని ప్రశ్నించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో మీ ఫినాయిల్ పత్రిక, టీవీ పాల్పడిన విధ్వంసం మర్చిపోతే ఎలా సాయిరెడ్డీ అంటూ వెంకన్న ట్వీట్ చేశారు.
చరిత్ర అంటే చంద్రబాబుదే..
బిల్‌గేట్స్ భారత్‌కు వస్తేనే మీకు చంద్రబాబు గుర్చొచ్చి ట్వీట్లు పెడుతున్నారు చూశారా! అదీ చరిత్ర అంటే. చరిత్ర సృష్టించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం అని ఎంపీ విజయసాయిరెడ్డిని ట్యాగ్ చేస్తూ వెంకన్న కామెంట్ చేశారు. 151 సీట్లు గెలిచి, మెడలు వంచి దండాలు పెడుతున్నా 16నెలల జైలు చరిత్ర చూసి ప్రధాని మోదీ నుండి అమిత్‌షా వరకూ మిమ్మల్ని, మీ సీఎంని కలవడానికి కూడా ఇష్డపడటం లేదనేది జగమెరిగిన సత్యమన్నారు. లోపల చీవాట్లు తిన్నా బయటకొచ్చి వారి వెనుకే నడుస్తూ ఫొటోలో రావాలని చేసే ప్రయత్నానికి అయినా మీకు అవార్డు ఇవ్వాల్సిందే అంటూ ట్విట్టర్‌లో వెంకన్న కామెంట్ చేశారు.