విజయవాడ

కృష్ణా వర్సిటీ బాస్కెట్‌బాల్ చాంప్ లయోల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), నవంబర్ 19: ఆంధ్ర లయోల కళాశాల ఆధ్వర్యంలో జరిగిన కృష్ణా విశ్వవిద్యాలయం అంతర కళాశాలల బాస్కెట్‌బాల్ పురుషుల చాంపియన్‌గా అతిథ్య ఆంధ్ర లయోల కళాశాల నిలిచింది. వరుసగా ఆంధ్ర లయోలా కళాశాల, వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డీఎఆర్ కళాశాల, కేబీఎన్ కళాశాలల జట్లు మొదటి నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ విక్టర్ ఇమ్మానుయేల్ పాల్గొని విజేతలకు ట్రోపీలను అందజేశారు. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో కేబీఎన్ కళాశాలపై 51-27 తేడాతోడీఎఆర్ కళాశాల, వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌పై 64-49 తేడాతో ఆంధ్ర లాయోల కళాశాల, కేబీఎన్ కళాశాలపై 52-31 తేడాతో ఆంధ్ర లాయోల కళాశాల, డీఎఆర్ కళాశాలపై 52-46 తేడాతో వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విజయం సాధించాయి.