విజయవాడ

స్టెల్లా కాలేజీ హాస్టల్‌లో 30మంది విద్యార్థినులకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, నవంబర్ 21: నగరంలోని ప్రముఖ విద్యాసంస్థ మారిస్ స్టెల్లా కళాశాలలో 30మంది హాస్టల్ విద్యార్థినులు గురువారం ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. అస్వస్థతకు గురైన వారంతా హాస్టల్ విద్యార్థినులే కావటంతో ఫుడ్ పాయిజనింగ్ జరిగిందనే ప్రచారం సాగింది. కానీ కళాశాల యాజమాన్యం ప్రతినిధులు మాత్రం వారందరికీ వైరల్ ఫీవర్ సోకిందని వివరణ ఇచ్చారు. ఫుడ్ పాయిజనింగ్ జరిగిందనే ప్రచారాన్ని యాజమాన్యం కొట్టిపారేశారు. అయితే ఒకేసారి 30మందికి వైరల్ ఫీవర్ ఎలా వచ్చిందనే ప్రశ్నకు మాత్రం కళాశాల యాజమాన్యం వారు సమాధానమివ్వలేదు. అస్వస్థతకు గురైన 30మంది విద్యార్థినులను ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు. చికిత్స అనంతరం 15మందిని వారి ఇళ్లకు పంపినట్లు చెప్పారు. మిగిలిన వారు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. కళాశాల హాస్టల్‌లో 450 మంది విద్యార్థినులు వుండగా 30మందికి మాత్రమే ఫుడ్ పాయిజనింగ్ ఎలా జరుగుతుందని యాజమాన్యం అంటోంది. కాగా, విషయం తెలిసి తల్లిదండ్రులు, బంధుమిత్రులు విద్యార్థినులను పరామర్శించేందుకు ఆసుపత్రి, కళాశాల వద్దకు రావటంతో స్పల్ప ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.