విజయవాడ

వీఎంసీ ఎన్నికల్లో వైకాపా జెండా ఎగరేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, నవంబర్ 21: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తనపై నమ్మకం ఉంచి తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తూర్పులో పార్టీని బలోపేతం చేస్తానని దేవినేని అవినాష్ చెప్పారు. గురువారం ఉదయం గుణదలలోని తన ఇంట్లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రానున్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామన్నారు. తన తండ్రి దేవినేని రాజశేఖర్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని, తమ కుటుంబానికి ఆనాటి కంకిపాడు, నేటి విజయవాడ తూర్పు నియోజకవర్గంతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తూర్పు నియోజకవర్గంలో వైకాపా జెండా రెపరెపలాడేలా ముందుకు తీసుకెళతానని చెప్పారు. తనను తూర్పు నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించటానికి కృషి చేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బొప్పన భవకుమార్‌కు అవినాష్ కృతజ్ఞతలు తెలిపారు. విలేఖరుల సమావేశంలో సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, వెంకట సత్యనారాయణ, వీ రమణ, సంగెపు కోటినాగులు, బచ్చు మురళి, తదితరులు పాల్గొన్నారు.

వైకాపా నగర అధ్యక్షుడు
బొప్పనకు నేతల శుభాకాంక్షలు
పటమట, నవంబర్ 21: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా నియమితులైన బొప్పన భవకుమార్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం పటమటలోని నిర్మలా కానె్వంట్ దగ్గర ఆయన కార్యాలయంలో పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో వచ్చి బొప్పనను కలిశారు. ఈసందర్భంగా బొప్పన మాట్లాడుతూ తనను వైకాపా నగర అధ్యక్షుడిగా నియమించటం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో సమన్వకర్తగా పార్టీని బలోపేతం చేసి తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానన్నారు. నగర అధ్యక్షుడిగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలో వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం వుంచి నగర అధ్యక్ష పదవి కట్టబెట్టినందుకు వైకాపా అధిష్ఠానానికి బొప్పన కృతజ్ఞతలు తెలిపారు.