విజయవాడ

ఓడీఎఫ్ ప్లస్‌పై అవగాహనకు జిల్లాలో విస్తృత ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), నవంబర్ 21: జిల్లాలో ఓడీఎఫ్ ప్లస్ సుస్థిర పారిశుద్ధ్య కార్యక్రమంపై ప్రజల్లో అవగాహనకు విస్తృత ప్రచార కార్యక్రమం చేపట్టనున్నామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. జిల్లాలోని 200 గ్రామాల్లో 60రోజుల పాటు ఈ ప్రచార కార్యక్రమం సాగుతుందని చెప్పారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఓడీఎఫ్ ప్లస్ సుస్థిర పారిశుద్ధ్య అవగాహన ప్రచార స్వచ్ఛ రథాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1,46,497 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి ఓడిఎఫ్ సాధించినట్లు తెలిపారు. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించక పోవడం, తదితర అంశాలను గుర్తించామన్నారు. అలాంటి 180 - 200 గ్రామాల్లో ఓడీఎఫ్ ప్లస్ సుస్థిర పారిశుద్ధ్య అవగాహన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. స్వచ్ఛరథం 2నెలల పాటు ఆయా గ్రామాలలో పర్యటించి పారిశుద్ధ్యం ప్రాముఖ్యత, మరుగుదొడ్డి వాడకపోడే వచ్చే అనర్థాలు తెలియచేసి 8 రకాల వీడియో క్లిప్పింగ్స్‌తో అవగాహన కల్పిస్తుందన్నారు. జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారు, తదితరులకు మరుగుదొడ్లు అవసరమైతే మంజూరు చేస్తామన్నారు. 31 డిసెంబర్ నాటికి అన్ని మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసుకొని వినియోగించుకోవాలన్నారు. ప్రజలంతా తప్పనిసరిగా మరుగుదొడ్లు వినియోగించుకుంటూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. ప్లాస్టిక్ రహిత జిల్లా కూడా మన లక్ష్యం కావాలన్నారు. ప్లాస్టిక్ వాడకం లేని పర్యావరణ ప్రపంచం శ్రేష్టమన్నారు. ప్లాస్టిక్ వస్తువులను నిషేధించి ఆరోగ్యాన్ని కాపాడుకుందామని కలెక్టర్ ఇంతియాజ్ ఈసందర్భంగా పిలుపిచ్చారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ అమరేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.