విజయవాడ

బాలలపై హింసలేని సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 21: బాలల హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయడం ద్వారా బాలలపై హింస లేని సమాజ నిర్మాణంలో భాగస్వాములైతే రాష్ట్రాన్ని బాలల స్నేహ రాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ - చైల్డ్‌లైన్ సే దోస్తి వారోత్సవాల్లో భాగంగా నగరంలో జరిగిన చైల్డ్‌లైన్ సే దోస్తి, బాలల జీవితాల్లో వెలుగులు నింపుదాం అనే పోస్టర్‌ను గురువారం ఆమె ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ ఆపదలో ఉన్న బాలలందరినీ అండగా ఉండి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వ పరంగా విస్తృత చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులన్న సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తు సమాజంలో ఉత్తమ పౌరుల కోసం బాలలను పరిరక్షించి, వారి హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం అందితే రేపటి సమాజం ఉత్తమ సమాజంగా తయారవుతుందన్నారు. చైల్డ్‌లైన్ జిల్లా కోఆర్డినేటర్ అవర రమేష్ మాట్లాడుతూ చైల్డ్‌లైన్ -1098 ద్వారా జరుగుతున్న సేవల గురించి మంత్రికి వివరించారు. చైల్డ్‌లైన్ 1098 మరింత ప్రచారం చేయడం ద్వారా మరింత ఎక్కువ మంది బాలలను పరిరక్షించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ సీఐడీ ఎస్పీ (మహిళా విభాగం) కేజీవీ సరిత, జిల్లా సీడబ్ల్యూసీ చైర్మన్ బీవీఎస్ కుమార్, సభ్యులు సోహిద్ సఫాని, గుంటూరు జిల్లా సీడబ్ల్యూసీ చైర్మన్ సుజ్ఞాన, తదితరులు పాల్గొన్నారు.

మతం ముసుగులో నీచ రాజకీయం తగదు
* చిల్లర ఎత్తుగడలతో చతికిలపడుతున్న జగన్ * ట్విట్టర్‌లో టీడీపీ ఎమ్మెల్సీ వెంకన్న ధ్వజం
విజయవాడ (సిటీ), నవంబర్ 21: కులం, మతం, ప్రాంతం ముసుగులో నీచ రాజకీయాలు చేయడం ఒక్క జగన్‌కే చెల్లిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ఎప్పుడూ చిల్లర రాజకీయ ఎత్తుగడలు వేస్తున్న జగన్ చతికలపడుతూనే ఉన్నారని గురువారం ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. ట్రైన్లు తగులబెట్టించడం వంటి ఘటనలు అనేకం జగన్ చరిత్రలో ఉన్నాయని ఆరోపించారు. ‘నారా హమారా’ కార్యక్రమంలో అలజడి సృష్టించాలని చిల్లర రాజకీయ ఎత్తుగడలేసి దొరికిపోయిన ఘటన రాష్ట్ర ప్రజలు ఎలా మర్చిపోతారని గుర్తుచేశారు. వారంతా మీ పార్టీ కార్యకర్తలేనని ఆధారాలతో సహా దొరికిపోయిన తరువాత కూడా మీరు మతం రంగు పులమాలనుకోవడం అవివేకం అవుతుంది సీఎం జగన్ గారూ.. అంటూ ట్విట్టర్‌లో సీఎం జగన్‌ను ట్యాగ్ చేస్తూ వెంకన్న కామెంట్ చేశారు.