విజయవాడ

డిమాండ్‌కు తగ్గట్టుగా ఉల్లిపాయలు సరఫరా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, డిసెంబర్ 4: పేదవారిని ఊరించి ఊరించి ఉల్లిపాయలు అందిస్తున్న ప్రభుత్వం నిన్నా మొన్నటి వరకు మనిషికి రెండు కిలోలు అమ్మినవారు నేడు కిలో మాత్రమే అమ్మడంతో రైతుబజారులోని ఎస్టేట్ ఆఫీసర్‌లు అనేక రకాలుగా ఇరకాటంలో పడుతున్నారు. వినియోగదారులకు డిమాండ్ మేరకు ఉల్లిపాయలు అందించలేని ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ అధికారులు నగరంలోని రైతుబజార్లలో బస్తాలను సర్దుబాటు చేస్తున్నారేగాని వినియోగదారులకు సరపడా సరఫరా చేయలేకపోతున్నారు. ఉల్లిపాయల కొనుగోలుదారులు మాత్రం గంటల తరబడి బారులు తీరుతున్నారు. మంగళవారం అధికారులు కేవలం 221 బస్తాలు నగరానికి పంపగా వాటిల్లో పీడబ్ల్యుడి గ్రౌండ్‌లోకి 100 బస్తాలు, భవానీపురం రైతుబజారుకి 50 బస్తాలు, కేదారేశ్వరపేట రైతుబజార్‌కి 40 బస్తాలు, కంకిపాడు రైతుబజార్‌కి 31 బస్తాలు సర్దుబాటు చేశారు. అయితే కేదారేశ్వరపేటలో మంగళవారమే అయిపోయాయి. భవానీపురం మోడల్ రైతుబజారులో బుధవారం ఉదయం రెండు స్టాల్స్ పెట్టి అధికారులు అమ్మించారు. భవానీపురం రైతుబజారులో 3రోజుల క్రితం ప్రతి ఒక్కరికీ రెండు కిలోల చొప్పున అమ్మగా తక్కువ వచ్చిన ఉల్లిపాయలు అందరికీ అందించాలనే ధ్యేయంతో ప్రతి మనిషికి కేవలం కిలో ఉల్లిపాయలు మాత్రమే అందించారు. దాంతో వినియోగదారుల నుండి అధికారులు పలు విమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చింది. పైగా ప్రతిపక్ష పార్టీ వారికి టీడీపీ సానుభూతిపరులకు ఇది అవకాశంగా మారింది అధికారులతో వాదనకు దిగారు. ఎంత సేపు లైన్‌లో నిలబడినా చివరకు ఒక కిలో మాత్రమే ఇస్తున్నారనగానే క్యూలైన్‌లోని వారంతా ఫోన్‌ల ద్వారా కుటుంబ సభ్యులను పిలిపించుకుని క్యూలైన్‌లో నిలబెట్టించారు. దాంతో ఒక్కో కుటుంబానికి రెండు నుండి నాలుగు కిలోలు అందాయి. అది గమనించని అధికారులు నిలువరించేందుకు యత్నిస్తే లైన్‌లో వచ్చాం ఇవ్వరా అంటూ వాదనకు దిగుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో నేడు కిలో ఉల్లిపాయలు వాటి ఆరుదల, సైజ్‌లను బట్టి రూ. 80 నుండి 100ల వరకు ధర పలుకుతున్నారు. దాంతో ఉల్లి ధరలు భరించలేక రైతుబజారుల వద్ద వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది.

మంత్రి కొడాలి నానిపై
పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు
విజయవాడ పశ్చిమ, డిసెంబర్ 4: మంత్రి కొడాలి నాని పశ్చిమ నియోజకవర్గంలోని వన్‌టౌన్, కొత్తపేట పోలీసు స్టేషన్‌లలో బుధవారం ఉదయం పలు డివిజన్‌లలో టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు ఫిర్యాదులు చేశారు. గత నెల 16న రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి కొడాలి నాని వెలగపూడి సచివాలయంలో తిరుమల తిరుపతి ప్రతిష్టను భంగం కలిగించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.