విజయవాడ

వివిధ పంటల సాగుకు రుణ పరిమితి ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 4: జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి వివిధ పంటలకు రుణ పరిమితిని నిర్థారిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలను జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ రూపొందించింది. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అధ్యక్షతన వివిధ పంటల రుణ పరిమితి నిర్థారణ ప్రతిపాదనలు రూపొందించేందుకు జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశాన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఖరీఫ్, రబీలో ఎకరానికి రూ.38వేలు, శ్రీవరి సాగుకు ఎకరానికి రూ.30వేలు, చెరకు మొక్కకు ఎకరాకు రూ.74 వేలు, పిలకకు రూ.58 వేలు, వేరుశనగకు ఖరీఫ్‌లో ఎకరాకు రూ.22 వేలు, రబీలో రూ.23వేలు, ప్రతి బీటీ సీడ్‌కి రూ. 92వేలు, ప్రత్తి బీటీకి రూ.48వేలు, ఎండి మిర్చికి రూ.68 వేలు, సన్ ఫ్లవర్‌కి రూ.17 వేలు, నాటు పొగాకుకు రూ.33వేలు, వర్జీనీయ పొగాకుకు రూ. 41వేలుకు రుణ పరిమితిని నిర్థారించారు. పప్పు దినుసులు ఖరీఫ్‌లో రూ.15వేలు, రబీలో రూ.17వేలు, జొన్నలకు ఖరీఫ్‌లో రూ.16వేలు, రబీలో రూ.17 వేలు, మొక్కజొన్న ఖరీఫ్‌లో రూ. 35వేలు, రబీలో రూ.45 వేలు, మొక్కజొన్న విత్తనాలకు ఖరీఫ్‌లో రూ. 35వేలు, రబీలో రూ.42 వేలు నిర్థారించారు. వర్కింగ్ క్యాపిటల్ మంచినీటి చెరువుల్లో చేపల పెంపకానికి రూ.4 లక్షలు, ఫంగస్ చేపల పెంపకానికి రూ.5 లక్షలు, రొయ్యల మొదటి పంటలకు రూ.లక్ష, 2 పంటలకు రూ.80 వేలు, పనామీ రొయ్యల 2 పంటకు రూ. 7 లక్షలు, ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి రూ. 60వేలు, మామిడి తోటలకు రూ. 37వేలు, జాము తోటలకు రూ. 45 వేలు, కర్పుర అరటి పండ్ల తోటకు రూ. 52 వేలు, టీష్యు అరటికి తోటకు రూ. 52 వేలు, కొబ్బరి తోటకు రూ. 32 వేలు, రుణ పరిమితిని నిర్థారించారు. దీనిని ప్రభుత్వ పరిశీలన కోసం నివేదిక పంపడం జరుగుతుందని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సీఈఓ ఎన్ రాజయ్య, నాబార్డు డీడీఎం విజయ తిరిమెల్ల, అభ్యుదయ రైతులు బీవీ రాఘవరావు, కే రామకృష్ణ, ఎస్ సత్యనారాయణ, బీవీ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.