విజయవాడ

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, డిసెంబర్ 4: మృగాళ్ల అకృత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్న నరరూప రాక్షసులు అత్యంత క్రూరంగా మహిళలపై పెట్రోలు పోసి దహనకాండకు పాల్పడుతున్నారు. అయినా పెట్రోలు బంకుల యాజమాన్యాలు మాత్రం పెట్రోలు, డీజిల్‌లను బాటిళ్లలో, క్యాన్‌లలో పోసి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. సుమారు మూడు దశాబ్దాల క్రితం చిలుకలూరుపేటలో ఆర్టీసీ బస్‌లోని ప్రయాణికులను బెదిరించి దోపిడీ చేయాలని యత్నించిన నలుగురు దుండగులు బస్‌లో పెట్రోలు పోయగా మంటలు వ్యాపించి 21 మంది సజీవ దహనమైన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దుండగులు బెదిరించడానికి యత్నించి పెట్రోలు పోయగా ఎవరో సిగరెట్ కాల్చుకోడానికి వెలిగించిన అగ్గిపుల్ల కిందపారేయడంతో పెట్రోలుకు మంటలు అంటుకుని క్షణాల్లో బస్సంతా వ్యాపించి 21మంది సజీవ దహనమయ్యారు. ఆనాడే కేంద్ర ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న పెట్రోలు బంకుల్లో సీసాలు లేదా క్యాన్‌లలో పెట్రోలు, డీజిల్ కొట్టవద్దని పెట్రోలు బంకుల యాజమాన్యాలకు సర్క్యూలర్ పంపించారు. కొన్నాళ్లు అమలైంది. కాలక్రమేణా ఆ నిబంధన కాలగర్భంలో కలిసిపోయింది. 21మందిని పొట్టన పెట్టుకున్న ఆ సంఘటన రాష్ట్ర ప్రజలు ఇంకా మరువలేదు. హైదరాబాద్‌లో వైద్యురాలు దిశ సంఘటనలో దుండగులు పెట్రోలు ఉపయోగించారని పోలీసుల విచారణలో తేలింది. అంటే మళ్లీ పెట్రోలు బంకుల్లో క్యాన్లలో పెట్రోలు నిషేధం అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు బంకుల్లో క్యాన్‌లలో ఇంధనం నింపడాన్ని నిషేధించింది. అయితే ఏదో జరిగాక పాత నిబంధనల ఫైళ్లు బూజులు దులపడం కాదు, కేంద్ర ప్రభుత్వం నిషేధం ఆదేశాలను పాటించాల్సిన బంకుల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. నగర శివారుల్లో బడ్డికొట్టు వద్ద కూల్‌డ్రింక్స్ బాటిళ్లలో పెట్రోలు యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. సహకార రంగంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన లారీ ఓనర్స్ బంక్ ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్లీ లిమిటెడ్ కో-ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్‌కి చెందిన గొల్లపూడిలోని పెట్రోలు బంకులో 50లీటర్ల క్యాన్‌లలో డీజిల్ కొడుతున్నారు. ఇలాంటి అమ్మకాలపై యాజమాన్యం నియంత్రణ కొరవడింది.