విజయవాడ

వీఎంసీ, తూర్పులో వైసీపీ జెండా ఎగరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, డిసెంబర్ 4: విజయవాడ కార్పొరేషన్, తూర్పు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా రెపరెపలాడేలా కార్యకర్తలు, దేవినేని కుటుంబ సభ్యులు కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం బెంజి సర్కిల్ సమీపంలోని శేషసాయి కళ్యాణ వేదికలో విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి, దివంగత నేత దేవినేని రాజశేఖర్ నెహ్రూకు మధ్య సాన్నిహిత్యం వుండేదని గుర్తుచేశారు. 2014 ఎన్నికలకు ముందు నెహ్రూను వైసీపీలోకి రావాలని ఆహ్వానించామని, అయితే ఎందుకో ఆయన తప్పటడుగు వేశారన్నారు. వచ్చే ఉగాది నాటికి నగరంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లపట్టాలు, ఇళ్లు మంజూరు చేస్తామని ఈసందర్భంగా మంత్రి తెలిపారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ నక్కజిత్తుల చంద్రబాబు నాయుడు నెహ్రూపై లోలోపల కోపంతోనే తనపై ఓడతాడని తెలిసి కూడా దేవినేని అవినాష్‌ను పోటీ చేయించాడని ఆరోపించారు. ఎన్టీఆర్ మరణించేంత వరకు దేవినేని నెహ్రూ ఆయన వెంటే ఉండటంతో చంద్రబాబు కపటప్రేమ నటించాడని ధ్వజమెత్తారు. సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ అవినాష్ వైసీపీలో చేరటం వల్ల దింగత నేత నెహ్రూ ఆత్మ శాంతిస్తుందని అన్నారు. రాజకీయాల్లో పవన్‌నాయుడు కొత్త ఊసరవెల్లి పాత్ర పోషిస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబును ప్రశ్నిస్తానన్న జనసేన నేత పవన్‌నాయుడు పశ్నించటం అటుంచి ఎన్నికల్లో 450 కోట్లు చంద్రబాబు దగ్గర, 150 కోట్లు విదేశాల్లోని కాపు సోదరుల దగ్గర దండుకుని సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. మత మార్పిడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి జనన్మోహన్‌రెడ్డి పట్టించుకోవడం లేదని లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. దింగత నేత నెహ్రూకు ఆత్మ, పరమాత్మ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు అన్నారు. అవినాష్, బుచ్చిబాబు వెన్నంటి ఉండి రాబోయే వీఎంసీ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అవినాష్, మల్లాది విష్ణు, తదితరుల ఆధ్వర్యంలో 59 సీట్లలోనూ వైసీపీని గెలిపిస్తామన్నారు. గతంలోనే వైసీపీలోకి రావాలని దివంగత నెహ్రూ భావించారని, అయితే చంద్రబాబు మాటలు విని ఆగిపోయారని అన్నారు. గత టీడీపీ కార్పొరేటర్లు అవినీతితో వీఎంసీని దోచుకున్నారని ఆయన ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ అవినాష్‌పై నమ్మకంతోనే తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జిగా జగన్మోహన్‌రెడ్డి నియమించారని తెలిపారు. అవినాష్‌ను జగన్ తమ్ముడిగా చూసుకుంటారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే 4లక్షల ఉద్యోగాలు, భరోసా కింద రైతులకు 4వేల కోట్లు ఇచ్చారని తెలిపారు. యువ నాయకుడు, తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డి తనపై ఉంచిన నమ్మకంతో నగర కార్పొరేషన్‌లో, తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగురవేస్తామని చెప్పారు. సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ నగరంలో జరిగే ఎన్నికల్లో వైసీపీ జెండా రెపరెప లాడుతుందన్నారు. అనంతరం అనేక మంది మాజీ కార్పొరేటర్లు మంత్రుల సమక్షంలో వైసీపీలో చేరారు. సభా ప్రారంభానికి ముందు గుణదలలోని దేవినేని అవినాష్ ఇంటి వద్ద నుండి సుమారు 5వేల మంది వైసీపీ కార్యకర్తలతో అవినాష్, బుచ్చిబాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, నాయకులు పొట్లూరి వరప్రసాద్, రెహమాన్, కోగంటి సత్యం, వేమూరి చిట్టయ్య, మాజీ కార్పొరేటర్లు, నగర నాయకులు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.