విజయవాడ

కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన హోంగార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 10: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో హంగార్డుగా విధులు నిర్వహిస్తూ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన అభ్యర్ధులను పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు అభినందించారు. నగర పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తున్న హంగార్డుల ఆర్ధిక పరిస్ధితిని దృష్టిలో ఉంచుకుని వారికి సాయం చేయాలనే ఉద్ధేశ్యంతో పోలీసు కమిషనర్ అర్హత ఉన్న వారికి పేద యువతకు ప్రత్యేకంగా చేరువ పేరిట ఉచిత శిక్షణా తరగతులను శ్రీ్ధర్ సెంటర్ ఫర్ కాంపిటెటివ్ ఎగ్జామినేషన్స్ సహకారంతో ఉచిత శిక్షణా తరగతులనలు ఏర్పాటు చేశారు. 2018లో జరిగిన పోలీసు కానిస్టేబుల్ సెలక్షన్‌లో విజయవాడ హోంగార్డు విభాగంలో పని చేస్తున్న 76మంది హాజరవ్వడం జరిగింది. చేరువ ద్వారా శిక్షణ పొందిన వారిలో పది మంది కానిస్టేబుల్ పోస్టులు సాధించారు. ఈసందర్భంగా శిక్షణకు వెళ్తున్న పది మంది హోంగార్డులు పోలీసు కమిషనర్‌ను కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి కృతఙ్ఞతలు తెలియచేశారు. ఎంపికైన అభ్యర్ధులను అభినందించిన సీపీ మరింత ఉత్సాహంగా పోలీసు ఉద్యోగంలో సేవానిరతితో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రైం డీసీపీ కోటేశ్వరరావు, ఆర్‌ఐ హోంగార్డ్సు, ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్ధులు పది మంది ఉన్నారు.

కస్టమ్స్ నూతన కమిషనర్‌ను
కలిసిన జిఎస్‌టి, కస్టమ్స్ సూపరింటెండెంట్స్ అసోసియేషన్
విజయవాడ (క్రైం), డిసెంబర్ 10: ఆంధ్రప్రదేశ్ నూతన కస్టమ్స్ కమిషనర్‌గా విజయవాడలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఐఆర్‌ఎస్ అధికారి కె వెంకట రామిరెడ్డిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇన్‌డైరెక్ట్ టాక్స్‌స్ అండ్ కస్టమ్స్ శాఖ గ్రూపు బి గజిటెడ్ సూపరిటెండెంట్స్ అసోసియేషన్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆటోనగర్‌లోని బహుళ అంతస్తుల భవనం స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్‌లోని కస్టమ్స్ ప్రధాన కార్యాలయంలో నూతన కమిషనర్‌ను ఐదు జిల్లాల సూపరింటెండెంట్‌ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గద్దె తిలక్, ఎం నాగరాజులు మంగళవారం కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు.

న్యాయం గెలుస్తుంది : బొండా ఉమా
విజయవాడ (క్రైం), డిసెంబర్ 10: త్వరలోనే న్యాయం గెలుస్తుందని, అన్యాయానికి చరమగీతం పాడుతామని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తత్ర స్ధాయి సమావేశం అజిత్‌సింగ్‌నగర్ షాదీఖానాలో మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా తెనాలి శ్రావణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించారని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గతంలో అత్యధిక సీట్లు స్థానిక ఎన్నికల్లో వచ్చాయని, 2019 ఎన్నికల్లోనూ ప్రజలు తనను గెలిపించారని, హైకోర్టులో కేసు నడుస్తోందని త్వరలో మంచి కబురు వస్తుందని అశాభావం వ్యక్తం చేశారు. త్వరలో జరుగనున్న సంస్ధాగత ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం నియోజకవర్గ స్ధాయిలో వివిధ ప్రాంతాల్లో విస్తృత స్ధాయి సమావేశం నిర్వహిస్తున్నామని వార్డు స్ధాయి నాయకుడిని కూడా స్ధానిక కార్యకర్తలు ఎన్నుకుని రానున్న సంస్ధాగత ఎన్నికల్లో గెలుపుకోసం పని చేస్తున్నట్లు చెప్పారు.