విజయవాడ

పుష్కరకాల ఎడబాటు.. 24గంటల్లో తల్లిదండ్రుల చెంతకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 10: పుష్కర కాలం పైగా ఎడబాటు.. చిన్న వయస్సులో తప్పిపోయి విక్రయించబడిన బాలిక పొరుగు రాష్ట్రంలో పెరిగి పెద్దయి ఇప్పుడు తల్లిదండ్రులు, కుటుంబం కోసం అనే్వషణ ప్రారంభించింది. భాగంగా ‘స్పందన’ను ఆశ్రయించడంతో ప్రచార మాధ్యమాల్లో వెలువడిన కధనాల ఆధారంగా తెలుసుకున్న తల్లిదండ్రులు బిడ్డను హత్తుకునేందుకు పరుగులు పెట్టారు. తమవారిని కలపండంటూ చేసిన విఙ్ఞప్తికి స్పందించిన పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు స్వీయ పర్యవేక్షణలో రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లో తల్లిదండ్రులు, కుమార్తెను కలిపారు. దీంతో స్పందన కృషి ఫలించినట్లైంది. నగరానికి చెందిన మహిళ తన చిన్న వయస్సులో బస్టాండులో అదృశ్యమై లతగా తమిళనాడులో పెరిగి తిరిగి విజయవాడ వచ్చి తన తల్లిదండ్రుల కోసం అనే్వషిస్తున్న ఉదంతం తెలిసిందే. కాగా పోలీసుల కృషితో తల్లిదండ్రులు-బిడ్డ ఏకమైన సందర్భంగా తనకు సంతృప్తి నిచ్చిందని పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ప్రచార మాధ్యమాల్లో వచ్చిన ప్రకటన ఆధారంగా లత తల్లిదండ్రులు తనను కలిశారని, కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు గ్రామానికి చెందినర మంగళగిరి లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి కృష్ణాజిల్లాలో హోంగార్డుగా 2007లో పని చేస్తుండగా తన కుమార్తె మంగళగిరి ఆదిలక్ష్మీ (13) 2007 మార్చి 12వ తేదీ ఉదయం 11 గంటల నుంచి కనుపడటం లేదని తన కుమార్తె కొంచెం అమాయకంగా, మానసిక స్ధితి సరిగా లేని కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు గుడ్లవల్లేరు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా క్రైం నెంబర్ 32/2007 సెక్షన్ గర్ల్ మిస్సింగ్ కేసు నమోదైనట్లు తెలిపారు. తన కుమార్తె ఆదిలక్ష్మీ కనిపించకపోవడంతో తన హోంగార్డు ఉద్యోగాన్ని మానేసినట్లు తెలిపారు. ఈక్రమంలో డిసెంబర్ 9వ తేదీన స్పందన ద్వారా తన కుమార్తె తమిళనాడు నుంచి వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పత్రికల్లో వచ్చిన స్పందన ద్వారా తల్లిదండ్రులు తమ వద్దకు రావడం, కుటుంబం కోసం అనే్వషణలో ఉన్న లతను వారికి అప్పగించడం జరిగిందన్నారు. స్పందనకు వచ్చిన ఫిర్యాదు ద్వారా సత్వర చర్యలు చేపట్టి 24 గంటల్లోగా సదరు మహిళను తమ కుటుంబానికి చేరేలా కృషి చేసిన సిబ్బందిని అభినందించారు. కమిషనరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిడ్డ అదృశ్యంపై పోలీసులు సరిగా స్పందించలేదని హోంగార్డుగా ఉన్న లక్ష్మీ నారాయణ ఉద్యోగం వదిలేశారని, ఈ విషయం ఆమెకు పూర్తిగా గుర్తు లేకపోవడంతో వివరాలు తప్పుగా చెప్పిందన్నారు. దీంతో రేషన్ కార్డు, ఇతర ఆధారాలు కూడా వెరిఫై చేశామని, లత అలియాస్ ఆదిలక్ష్మీ వారి కుమార్తె అనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. అయితే శాస్ర్తియంగా నిర్ధారణ కోసం పరీక్షలు చేయిస్తామని పేర్కొన్నారు.
నన్ను రూ. 500లకు అమ్మేసింది : ఆదిలక్ష్మి
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తల్లిదండ్రుల చెంతకు చేరుకోవడం పట్ల ఆదిలక్ష్మీ హర్షం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ నన్ను ఐదువందల రూపాయలకు ఓ మహిళ అమ్మేసిందని, నన్ను కొనుక్కున్న మధురిక అనే మహిళ చెన్నై తీసుకెళ్లి పెంచి పెళ్లి చేసిందని చెప్పింది. ఆమె చనిపోయాక నా కన్నవారిని కలవాలనిపించిందని, అందుకు నా భర్త కూడా అంగీకరించి విజయవాడ తీసుకువచ్చారన్నారు. రామకృష్ణ అనే న్యాయవాదిని కలిసి విషయం వివరించామని, ఆయన సూచన మేరకు స్పందనలో ఫిర్యాదు చేశామని, ఇప్పుడు నా తల్లిదండ్రలను కలవడం ఆనందంగా ఉందన్నారు.
ఉద్యోగం కూడా వదిలేశాను : లక్ష్మీ నారాయణ
నా కుమార్తె ఆదిలక్ష్మీ గుడ్లవల్లేరులో 2007లో తప్పిపోయిందని, పాపను వెతికేందుకు కుదరకపోవడంతో హోంగార్డు ఉద్యోగం కూడా వదిలేశానని తండ్రి లక్ష్మీనారాయణ చెప్పారు. ఆ తర్వాత తిరుపతి ఇతర ప్రాంతాల్లో తిరిగినా పాప దొరకలేదని ఇప్పుడు స్పందన ద్వారా నా కూతురు మా చెంతకు చేరడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. కాగా విలేఖరుల సమావేశంలో జాయింట్ సీపీ డి నాగేంద్రకుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.