విజయవాడ

487 బార్లకు 528 దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పాయకాపురం), డిసెంబరు 10: రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం దరఖాస్తులు కోరగా 487 బార్లకు గాను 528 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి తెలిపారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దరఖాస్తుల గడువు సోమవారంతో ముగిసిందని తెలిపారు. త్వరలో లాటరీ పద్ధతిలో బార్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. ఇదిలావుంటే, ఇప్పటి బార్ల నిర్వాహకులు తమకు వచ్చే సంవత్సరం జూన్ వరకు మద్యం షాపుల లైసెన్సుల గడువు ఉందంటూ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 23న ఒక స్పష్టత రానుందని అధికారులు, బార్ల నిర్వాహకులు చెపుతున్నారు. ఈనేపథ్యంలో కొత్త మద్యం షాపుల ఏర్పాటుకు ఈసారి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో దరఖాస్తు సహా డిపాజిట్ మొత్తం కేవలం రూ. 20వేలు ఉంటే ఇప్పుడు దాన్ని ఏకంగా రూ. 10లక్షలకు పెంచడం, నాన్ రిఫండబుల్‌గా పేర్కొనడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. దీనికితోడు లైసెన్సు ఫీజులు కూడా గణనీయంగా పెంచడంతో అత్యధికులు దరఖాస్తు చేసుకునేందుకు ముందుకురాని పరిస్థితి నెలకొంది. అయితే బడాబాబులు మాత్రం సిండికేట్‌గా ఏర్పడి దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం.