విజయవాడ

మాజీ ఎమ్మెల్యేల మృతికి శాసనసభ సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) డిసెంబర్ 10: ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యేలు వీ.నరసింహరావుదొర, పీ. బ్రహ్మయ్య, డాక్టర్ కోడెల శివప్రసాదరావు బీ. సత్యారావు, టీ. రామిరెడ్డి, వాసిరెడ్డి వరద రామారావు, చదలవాడ జయరామ్‌బాబు, ముప్పలనేని శేషగిరిరావు, వై. వెంకటరెడ్డిలకు శాసనసభ మంగళవారం సంతాపం తెలిపింది. సీఎం జగన్మోహన్‌రెడ్డి, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబునాయుడు సహ సభ్యులు అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాల పాటు వౌనం పాటించి, సంతాపం వ్యక్తం చేశారు. అంతకుముందు స్పీకర్ తమ్మినేని సీతారాం మరణించిన నేతలు వారి వారి నియోజకవర్గాలలో అందించిన సేవలను కొనియాడుతూ వారి కుటుంబసభ్యులనకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.