విజయవాడ

కొత్తగా శ్మశానాలకు స్థలాలు కేటాయిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 10: రాష్ట్రంలో అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా శ్మశానాల కోసం స్థలాలు కేటాయిస్తామని శాసనసభ ప్రశ్నోత్తరాల్లో వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. నాగార్జున మాట్లాడుతూ తన నియోజకవర్గంలో తగినన్ని శ్మశాన వాటికలు లేక మృతదేహాలను కాలువల ఒడ్డున ఖననం చేస్తున్నారని అన్నారు. కొత్తగా ఇవ్వబోయే 20 లక్షల ఇళ్ల స్థలాల్లో ఎక్కడికక్కడే శ్మశానాల కోసం కూడా తగు స్థలాలు కేటాయించాలని కోరారు.

విజయవాడ చుట్టూ 185 కి.మీల పొడవుతో ఔటర్ రింగ్‌రోడ్
* మంత్రి బొత్స

విజయవాడ, డిసెంబర్ 10: విజయవాడ నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నివారణకై నగరం చుట్టూ జాతీయ రహదారి సంస్థ ఆధ్వర్యంలో 185కి.మీ పొడవున ఔటర్ రింగ్‌రోడ్డును నిర్మించాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం అంచనాలు రూపొందించే దశలో ఉందన్నారు.