విజయవాడ

వీఎంసీలో వైసీపీ జెండా ఎగరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, డిసెంబర్ 12: త్వరలో జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ జెండా రెపరెపలాడాలని, 59లో 40 డివిజన్లు వైసీపీ కైవసం చేసుకుంటుందన్న నమ్మకం తనకుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బెంజి సర్కిల్ సమీపంలోని జ్యోతి కనె్వన్షన్ సెంటర్‌లో గురువారం సాయంత్రం నగర వైసీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన బొప్పన భవకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ నమ్ముకున్న వ్యక్తులకు అండగా నిలిచే వ్యక్తి సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దటానికి సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని, ఇటీవల నగరాభివృద్ధికి సీఎం 100కోట్లు విడుదల చేశారని చెప్పారు. విజయవాడను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయటానికి సీఎం 2వేల కోట్లు ఇవ్వటానికి సిద్ధంగా వున్నారని తెలిపారు. నగరవాసులు తాగునీటికి ఇబ్బందులు పడకుండా, అలాగే ఆహ్లాదకరంగా గడపటానికి పెద్దపార్కుకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. రాబోయే వీఎంసీ ఎన్నికల్లో బొప్పన భవకుమార్ నాయకత్వంలో అందరూ సమన్వయంతో పనిచేసి వైసీపీ జెండాను ఎగురవేయాలన్నారు. వీఎంసీ ఎన్నికల్లో 59 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుని జగన్‌కు కానుకగా ఇవ్వాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలనా తీరును మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పారు. దళితుడినైన తనకు సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎంపీ సీటిచ్చి పార్లమెంట్‌కు పంపారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై ఆయనకు ఎంతప్రేమ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. మంత్రి పేర్ని నాని కూడా బొప్పనను అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, జోగి రమేష్, వరప్రసాద్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావ్, విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాష్, నాయకులు కడియాల బుచ్చిబాబు, పైలా సోమినాయడు, గౌతమ్‌రెడ్డి ప్రసంగించారు. అనంతరం బొప్పన భవకుమార్‌ను నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు.