విజయవాడ

ఆన్‌లైన్ మార్కెటింగ్‌తో మార్కెట్‌లోకి చేనేత వస్తువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబ్బీపేట, డిసెంబర్ 12: రాష్ట్రంలోని హస్తకళాకారులు తయారు చేస్తున్న వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించటం కోసం ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిఫ్‌కార్ట్ ముందుకు వచ్చిందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. తాడేపల్లిలోని సంస్థ కార్యాలయంలో రాష్టవ్య్రాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన 30మంది హస్తకళాకారులకు మార్కెటింగ్, ఉత్పత్తి, తదితర అంశాలపై గురువారం రెండు రోజుల పాటు వర్క్‌పాపు జరిగింది. ఇందులో మొదటిరోజు రతుల్ బోరార్ నేతృత్వంలోని ఫ్లిప్ కార్ట్ బృందం ఈ కామర్స్ ద్వారా మార్కెటింగ్‌కి సంబంధించిన అంశాలపై హస్తకళాకారులకు అవగాహన కల్పించారు. రెండోరోజు హస్తకళాకారులు తీసుకువచ్చిన ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్ బృందం ఫొటో షూట్ చేశారు. ఆ ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. కలంకారీ, కొండపల్లి, వెదురుబొమ్మలు, జూట్ బ్యాగ్స్, లేస్ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, అందుకే వివిధ హస్తకళల్లో నైపుణ్యం ఉన్నవారికి ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో మరింత మెరుగైన శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ మేనేజమెంట్ ట్రైనీ రతుల్ బోరార్ మాట్లాడుతూ రెండు రోజుల్లో సదస్సులో ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై అవగాహన కల్పించామని, త్వరలోనే ఫ్లిప్‌కార్ట్ బృందం హస్తకళాకారుల గ్రామాలకు వెళ్లి వారికి ప్యాకేజింగ్, షిప్పింగ్, బ్యాకింగ్, మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని మెళకువలు నేర్పిస్తామన్నారు. అంతే కాకుండా 6నెలల పాటు వారికి అన్ని విధాలా సహకరిస్తామని రతుల్ బొరార్ తెలిపారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హనుమనాయక్, జనరల్ మేనేజర్ సందీప్, మేనేజర్ మహేందర్‌తో పాటు వివిధ జిల్లాల హస్తకళాకారులు పాల్గొన్నారు.