విజయవాడ

‘సెంట్రల్’ అభివృద్ధికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 12: సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లలో నిలిచిపోయిన అభివృద్ధి పనుల నిర్వహణకు తక్షణం చర్యలు తీసుకోవాలని వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. గురువారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో వెంకటేష్‌తో సమావేశమైన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి పనులను వివరించారు. దీనిపై స్పందించిన కమిషనర్ అధికారులు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆదేశాలిచ్చారు. 1వ డివిజన్ గుణదల బ్రిడ్జి నుంచి గద్దె వెంకటరామయ్య నగర్ వరకూ రోడ్డు నిర్మించాలని, 45వ డివిజన్ మధురానగర్ బ్రిడ్జి నుంచి రైల్వేట్రాక్ వరకూ రోడ్డు విస్తరించాలని, మధురానగర్ పప్పుల మిల్లు రోడ్డు, కర్మల భవనం నిర్మాణం వంటి అంశాలను ఎమ్మెల్యే విష్ణు అధికారుల దృష్టికి తెచ్చారు. సింగ్‌నగర్ 52వ డివిజన్ తోటవారి వీధితో పాటు అంతర్గత రోడ్లను కూడా అభివృద్ధిపర్చాలని, 43వ డివిజన్ సంగీత కళాశాల నుంచి గాంధీనగర్ వరకూ అన్ని క్రాస్‌రోడ్లను, బందర్ రోడ్డు శ్మశానవాటిక అభివృద్ధి చేయాలని, గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అడ్డంకులు తొలగించాలని, కాల్వగట్ల వెంబడి ఇళ్లకు సూపర్ స్ట్రక్చరల్ పన్ను వేస్తే నీటి కుళాయిల ఏర్పాటుకు అవకాశం ఉంటుందని, దోమల సమస్యను పరిష్కరించాలని కమిషనర్ దృష్టికి తెచ్చారు. సమావేశంలో ఇంజినీరింగ్, ప్రజారోగ్య, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక, తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.