విజయవాడ

ఉల్లి లొల్లికి ముగింపెప్పుడో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, డిసెంబర్ 12: ఉల్లిపాయల లొల్లి రైతుబజార్ల పరిధులు దాటుతోంది. క్యూలైన్లలో తోపులాటలు నియంత్రించడానికి శాంతిభద్రతల విభాగం పోలీసుల బందోబస్తు మధ్య రైతుబజార్లలో ఉల్లిపాయల అమ్మకాలు సాగుతున్నాయి. గురువారం కేదారేశ్వరపేట రైతుబజారు వద్ద ఐదుగురు ట్రాఫిక్ పోలీసులు ప్రజల వాహనాలను నియంత్రించాల్సి వచ్చింది. ఉల్లిపాయల కోసం వినియోగదారులు వందలాది మంది బారులు తీరుతుండగా ద్విచక్ర వాహనాలను రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్కు చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో స్థానిక ట్రాఫిక్ పోలీసులు కేదారేశ్వరపేట రైతుబజారు వద్ద వాహనాల అడ్డంకులు తొలగించాల్సి వచ్చింది. వందలాది వాహనాలు రోడ్డుకు అడ్డుగా పెట్టిన వినియోగదారులను నియంత్రించాల్సి వచ్చింది. రైతుబజారు లోపల ఉల్లి అమ్మకాల కోసం రెండు కౌంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడ వినియోగదారుల రద్దీని, తోపులాటను నియంత్రించడానికి పోలీసులు విధులు నిర్వహించాల్సి వచ్చింది. ఎస్టేట్ ఆఫీసర్ సూరగాని కరుణాకర్ వృద్ధులకు, దివ్యాంగులకు ముందుగా అందేలా చర్యలు చేపట్టారు. భవానీపురం మోడల్ రైతుబజారులో గురువారం సెలవు అయినా ఉల్లిపాయల అమ్మకాలకు అధికారులు రెండు కౌంటర్లు ఏర్పాటు చేశారు. అందరికీ అందేలా కిలో చొప్పున ఉల్లిపాయలు అందించారు. భవానీపురం పోలీసుల బందోబస్తు మధ్య ఉల్లి అమ్మకాలు సాగాయి. క్యూలైన్‌లో నిలబడలేని ఐదారేళ్ల చిన్నారులు, 80ఏళ్ల వృద్ధులూ గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. నిలబడీ, నిలబడీ కాళ్లనొప్పులు వచ్చిన మహిళలు కిందనే చతికిలబడ్డారు. వృద్ధులు రైతుబజారు అరుగులపై పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఎస్టేట్ ఆఫీసర్ వరికల్లు కోటేశ్వరరావు, సిబ్బంది మండే శ్రీనివాసరావు, నందేటి శివ, తదితరులు వినియోగదారులకు సేవలు అందించారు. గురువారం 100 బస్తాల ఉల్లి అమ్మకాలు సాగాయి. కేదారేశ్వరపేట రైతుబజారులో 80 బస్తాల ఉల్లి విక్రయించారు. కేపీ ఉల్లిపాయలు మాత్రం క్యూలైన్లతో సంబంధం లేకుండా ఇవ్వడంతో వాటి అమ్మకాలూ బాగానే సాగుతున్నాయని రైతుబజారు సిబ్బంది తెలిపారు.