విజయవాడ

ప్లాస్టిక్ వస్తు వినియోగంపై కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 14: నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదాజ్ఞలను ఉల్లంగించి ఎవరైనా ప్లాస్టిక్ క్యారీబ్యాగ్‌లు, ఇతర వస్తువులను వినియోగించినా, విక్రయించినా కలెక్టర్ ఆదేశాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడునని వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. ఈమేరకు శనివారం నగరంలోని పలు వ్యాపార కేంద్రాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు నిషేధిత ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకుని, వ్యాపారులపై జరిమానా విధించారు. జోనల్ కమిషనర్ చంద్రయ్య నేతృత్వంలో పలువురు అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కలిసి స్థానిక 39వ డివిజన్ పరిధిలోని కెనాల్‌రోడ్డు, మార్వాడీ గుడి వీధి, శివాలయం వీధులలోని పలు ప్లాస్టిక్ దుకాణాలపై దాడులు నిర్వహించగా, క్యారీ బ్యాగ్‌లను స్వాధీనం చేసుకుని రూ.20వేల జరిమానా విధించి వసూలు చేశారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ చంద్రయ్య మాట్లాడుతూ నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగించిన, విక్రయించిన వారిపై రూ.50వేల నుంచి రూ.లక్ష వరకూ జరిమానాలను విధించడం జరుగుతుందని, మొదటిసారి రూ.50వేలు, 2వ సారి రూ.లక్ష, 3వ సారి పట్టుపడితే షాపు లైసెన్స్ రద్దు చేసి సీజ్ జేస్తామని హెచ్చరించారు. నగర పర్యావరణం, కాలుష్యంను నియంత్రించే చర్యల్లో భాగంగా చేపడుతున్న ప్లాస్టిక్ నిషేధాన్ని తూచా తప్పకుండా అమలుచేయాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్లాస్టిక్ రహిత నగర నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములవ్వాలని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కే శివరామకృష్ణ, బీఏ ప్రసాద్, ఎస్‌కే అయూబ్, తదితరులు పాల్గొన్నారు.

264 కేంద్రాల ద్వారా
43,777 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
* జేసీ మాధవీలత వెల్లడి

విజయవాడ, డిసెంబర్ 14: జిల్లాలో 264 కేంద్రాల ద్వారా ఇంతవరకు 5058 మంది రైతుల నుండి 43,777 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత చెప్పారు. స్థానిక క్యాంపు కార్యాలయం నుండి శనివారం నిర్వహించిన డయల్ యువర్ జాయింట్ కలెక్టర్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు, ఇతర అంశాలపై 31 ఫోన్‌కాల్స్‌ను జేసీ అందుకున్నారు. వాటిలో 11 మాత్రమే ధాన్యం కొనుగోలుకు సంబంధించినవి కాగా, మిగిలినవి 20 అంశాలపై వచ్చాయి. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో ఇంతవరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 1954 మంది రైతుల ఖాతాలకు రూ. 27.30 కోట్లు జమ చేశామన్నారు. సోమవారం నాటికి మిగిలిన రైతులకు రూ. 23.61 కోట్లు జమ చేస్తామన్నారు. తోట్లవల్లూరు మండలం పెనమకూరు గ్రామానికి చెందిన రైతు మాట్లాడుతూ తమ ధాన్యం కొనుగోలు కేంద్రానికి గోనెసంచులు సరిపడా సరఫరా కాలేదని తెలిపారు. దీనిపై జేసీ స్పందిస్తూ వెంటనే రైతులకు అవసరమైన గోనెసంచులను సంబంధిత రైస్‌మిల్ నుండి సిద్ధం చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. బంటుమిల్లి మండలం పెడతాముడి గ్రామానికి చెందిన రైతు మాట్లాడుతూ తాము పొలం కొని ఆరేళ్లు అయిందని, అయితే ధాన్యం రిజిస్ట్రేషన్ రికార్డుల్లో వేరేవారి పేరు నమోదైందన్నారు. మరికొందరు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం వెబ్‌సైట్‌లో తలెత్తుతున్న సాంకేతిక అంశాలను జేసీ దృష్టికి తెచ్చారు. వీటిపై జేసీ స్పందిస్తూ అక్కడికక్కడే సంబంధిత అధికారులకు వివిధ సమస్యల పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.