విజయవాడ

మహిళా గ్రాండ్ ప్రిక్స్‌లో హాంపీకి బంగారు పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 15: చెస్ క్వీన్, నగరానికి చెందిన చదరంగ క్రీడాకారిణి కోనేరు హాంపీ మరోసారి మెరిసింది. మోనాకోలో ఈ నెల 1నుండి 15వరకు జరిగిన ఫిడే మహిళల గ్రాండ్ ప్రిక్స్‌లో సంయుక్త విజేతగా నిలిచింది. 11రౌండ్లకు 7పాయింట్లతో రష్యాకు చెందిన అలెగ్జాండ్ర గోర్యచిన్కా, అలెగ్జాండ్ర కోస్టెనుక్‌తో కలిసి సంయుక్తంగా హాంపీ చాంపియన్‌గా నిలిచింది. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న కోనేరు హాంపీ 4 నెలల కాలంలో రెండో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈనెల 25నుండి మాస్కోలో జరగనున్న మహిళ ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నమెంట్‌లో పాల్గొననుంది.