విజయవాడ

రైతుబజారును వేరేలాగా మార్చొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, డిసెంబర్ 15: పాతబస్తీలోని నైజాంగేటు సెంటర్‌లోని రూపాబార్ ఎదురుగా గల మినీ రైతుబజార్‌ను వేరే అవసరాలకు ఉపయోగించాలని మంత్రి వెలంపల్లి కుట్ర చేస్తున్నారని అలా రూపమారితే ఉద్యమించాల్సి వస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. ఆదివారం ఆయన నిర్మాణంలో ఉన్న మినీ రైతుబజార్‌ని సందర్శించారు. కొందరు నాయకులు మినీ రైతుబజారుగా నిర్మిత అవుతున్న రైతుబజారుని కింద కూరగాయల వ్యాపారాలకు, పైన మీసేవా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ధ్యేయంతో ఉండగా వైకాపా ప్రభుత్వం ఆ నిర్మాణాన్ని వేరేలాగా ఉపయోగించాలని ఆలోచిస్తున్నారని మహేష్‌కి తెలిపారు. దాంతో మహేష్ మాట్లాడుతూ ఇలాంటి మార్పులు చేపడితే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. అదే ప్రాంతంలో పర్యటించిన ఆయన స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నూకలవారి వీధిలో మురుగుకాలువలపై చప్టాలు ఎత్తు పల్లాల్లా ఉన్నాయని వాటి మీదుగా నడవాలన్నా వాహనాలు నడపాలన్నాగాని, భయంభయంగా ఉంటుందని తెలిపారు. అ లాగే 36వ డివిజన్‌లో పలు ప్రాంతా ల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. మసీదు సందు, శివాలయం వీధి కొండ ప్రాంతాలు తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. కొండ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు ప్రమాదభరితంగా మారాయన్నారు. ఈ పర్యటనలో మహేష్‌తో పాటు జనసేన నాయకులు పల్లంటి రాజు, పైలా శ్రీనివాస్, వానపల్లి రామకృష్ణ, మత్తిరెడ్డి సాయి, బంకా ప్రకాష్, పొట్లూరి ప్రసాద్, పల్లంటి ఆది, దుర్గారావు, బంటుమిల్లి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

దుర్గమ్మకు సన్నిధిలో తెలుగు అకాడమీ చైర్‌పర్సన్
ఇంద్రకీలాద్రి, డిసెంబర్ 15: శ్రీకనకదుర్గమ్మను ఆదివారం ఉదయం రాష్ట్ర తెలుగు ఆకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతీ దర్శనం చేసుకున్నారు. తొలుత అర్చకులు చైర్మన్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అంతరాలయంలోకి తీసుకువెళ్లారు. అనంతరం దివ్య ఆశీస్సులివ్వగా ఈవో దుర్గమ్మ చిత్రపటం, ప్రసాదాలు అందచేశారు.
దుర్గమ్మ సేవలో క్రీడల శాఖ వైస్ చైర్మన్
అలాగే క్రీడల శాఖ వైస్ చైర్మన్ విష్ణువర్థన్‌రెడ్డి అమ్మవారికి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అంతరాలయంలోకి తీసుకువెళ్లారు. అనంతరం అర్చకులు ఆశీస్సులిచ్చి దుర్గమ్మ చిత్రపటం, ప్రసాదాలను అందచేశారు.