విజయవాడ

పౌరసత్వ సవరణ బిల్లు రద్దుకు ఉద్యమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 15: రాజ్యాంగపరంగా లభించిన హక్కుల ను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్య తిరేకిస్తూ సమైక్య పోరాటం చేసేందు కు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పి లుపునిచ్చారు. దాసరి భవన్‌లో ఆదివారం పౌరసత్వ సవరణ బిల్లును రద్దు చేయాలన్న అంశంపై ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, ఇన్సాఫ్‌లు నిర్వహించిన రౌం డు టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆ యన ఈసందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో తమకున్న మెజార్టీ సభ్యులతో సవరణ బి ల్లును అమోదించేలా చేసుకోవడంలో సఫలమైందని, కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వానికి భయపడుతుండటం వల్ల పలు రాజకీయ పార్టీలు సైతం వారికి వంత పాడుతున్నాయన్నారు. ఈబిల్లు వల్ల దేశం ప్రశాంతత కోల్పోయిందని, ఇప్పటికే అస్సాం, పశ్చిమ బెంగాల్ రా ష్ట్రాలు ఆందోళనలతో అట్టుడికి పోతున్నాయని, ఈ సెగ న్యూఢిల్లీకి సైతం పాకిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అజెండాగా బీజేపీ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ బి ల్లు కేవలం ముస్లింలకు మాత్రమే వ్యతిరేకం కాదని, రానున్న కాలంలో ప్రజలందరూ దీని ప్రభావంతో కనీస హ క్కులు కోల్పోయే ప్రమాదం ఉన్నందు న అన్ని రాష్ట్రాల్లోని అన్నివర్గాలు, రాజకీయ పార్టీలు సమైక్యంగా ఉద్యమించాల్సిన తరుణం అసన్నమైందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమకు ఎదురు మాట్లాడే ప్రతిపక్ష రాజకీయ పార్టీలను భయపట్టడం ద్వారా తమ గుప్పెట్లో పెట్టుకుందని, ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ వైఎస్సార్, తెలుగుదేశం పార్టీలు సైతం ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాయన్నారు. తమకు ఎదురు తిరుగుతు న్న నేతలను కేసుల పేరిట జైలులో పె డుతున్నారని, కాంగ్రెస్‌కు చెందిన మా జీ మంత్రి చిదంబరాన్ని ఈవిధంగానే 100రోజులకు పైగా జైలు పాలు చేశారని, జమ్ము రాష్ట్రంలో ముగ్గురు మాజీ మంత్రులను మూడు మాసాలకు పైబడి గృహ నిర్బంధం చేసి ఆ రాష్ట్రం ప్రశాంతంగా ఉందంటూ కేంద్రం చెప్పడం ఎంత వరకు సమంజమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కేవలం మైనార్టీల హక్కులను కాల రాస్తూ హిందూ వర్గాలతో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకునే లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్ అజెండగా పౌర సత్వ సవరణ బిల్లు ఫ్రవేశపెట్టిందన్నారు. బీజేపీపి ప్రభుత్వ తదుపరి టార్గెట్ కమ్యూనిస్టులేన్న విషయాన్ని గమనించాలన్నారు. ఈ సమావేశంలో సిద్ధార్థ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ దివాకర్‌బాబు, సీపీఐ రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, సీపీఐ ఎంఎల్ నేత జాస్తి కిషోర్‌బాబు, ఇన్సాఫ్ రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ అఫ్సర్, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ సుబ్బారావు, టీడీపీ మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఫతావుల్లా, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఏ రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.