విజయవాడ

కార్పొరేషన్ నిధులు దారి మళ్లించింది టీడీపీనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, డిసెంబర్ 15: కార్పొరేషన్ నిధులు దారి మళ్లించిన ఘనత టీడీపీకే దక్కిందని, అందుకే నగరంలో అభివృద్ధి కుంటుపడిందని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన పశ్చిమలోని 31వ డివిజన్‌లో పర్యటించారు. స్థానికులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో వారు ప్ర జల బాగోగులు గాలికి వదిలేశారన్నా రు. చిట్టినగర్ కుండల మార్కెట్ దగ్గర నుండి ప్రారంభమైన పర్యటన కేఎల్‌రావునగర్‌లోని పలు వీధుల్లో సాగిం ది. ప్రజలు తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకువచ్చినప్పుడల్లా ఇది టీడీపీ పాలకుల పాపమేనంటూ విమర్శలు గుప్పించారు. జమ్ములమ్మగుడి సమీపంలోని సుమారు 100 గజాల ఖాళీ స్థలాన్ని వైకాపా నాయకులు దే రంగుల వెంకట రమణ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ స్థలాన్ని వార్డు సచివాలయానికి కేటాయించాలని రమణ సూ చించగా మంత్రి స్పందించారు. ఆ స్థ లాన్ని సచివాలయానికి కేటాయించేలా తగిన చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. పలువురు మహిళలు తాము తాగేనీరు మురుగువాసన వస్తోందని వాటర్ పైపులు లీకై మురుగునీటితో మిళితమై మంచినీరు దుర్వాసన వస్తోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటర్ వర్క్స్ సిబ్బందికి ఆ సమస్య పరిష్కరించాలని సూచించారు. స్థానిక వృద్ధులు తమ ఇంటికి పట్టాలు లేవని, తమకు ఇంకా పింఛన్‌లు రావడంలేదని మంత్రికి తమ గోడుని విన్నవించుకోగా వారందరికీ మంత్రి భరోసా ఇచ్చారు. 31వ డివిజన్ అభివృద్ధికి రూ. 2.50కోట్లు నిధులు కేటాయించామన్నారు. చిట్టిపార్కును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. చిట్టినగర్‌లోని గుజ్జారి యల్లారావు చేపల మార్కెట్‌ని ఆధునికీకరిస్తామని రెండు విధాలుగా ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తామని కింద భాగంలో చేపలు, కూరగాయల మార్కెట్ పై భాగంలో కల్యాణ మండపంగా ప్రతిపాదన ఉందని మంత్రి తెలిపారు. అలాగే డివిజన్ వాసులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నామని తమ పాలనలో అభివృద్ధి ఏమిటో చూపిస్తామన్నారు. ఇదిలా ఉండగా జమ్ములమ్మగుడి వీధిలో మహిళలు, మహిళా వలంటీర్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధుల మాన ప్రాణాలతో ఆటాడుకుంటున్న మానవమృగాలను మట్టు పెట్టించడానికి దేశంలోని తొలిసారిగా మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదింపజేసిన సీఎం నిర్ణయానికి జేజేలు పలుకుతూ మహిళలు, యువతులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో డివిజన్ వైకాపా అధ్యక్షుడు కూరాకుల నాగు, నాయకులు సోమిశెట్టి వెంకటేష్, యరజర్ల మురళి, తమ్మిన రాము, నాగోతి శ్రీనివాసరావు, రాకేష్, జోజి, వెన్నం రజని, మైలవరం దుర్గారావు, అత్తులూరి పెదబాబు, జీవీఆర్ జోజి దేవి, తదితరులు పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

దుర్గగుడి ఈవో తనిఖీలు
ఇంద్రకీలాద్రి, డిసెంబర్ 15: దుర్గ మ్మ సన్నిధిలో ఈనెల 18నుండి ప్రా రంభం కానున్న భవానీదీక్షల విరమణ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లు, పనులు ఈవో సురేష్‌బాబు పరిశీలించారు. సహాయ ఈవోలు ఎన్ రమేష్, తిరుమలరావు, విజయ్‌కుమార్ వెంట రాగా ఘాట్‌రోడ్‌లో ఏర్పాటు చేస్తున్న క్యూమార్గాలను పరిశీలించి ఇంజనీరిం గ్ సిబ్బందికి మార్పుచేర్పులు తెలిపా రు. అలాగే చీరల కౌంటర్లు, రసీదు ఇ చ్చే కౌంటర్ పరిశీలించి సిబ్బందికి కొ న్ని సూచనలు జారీ చేశారు. మల్లిఖార్జున మహామండపం వద్ద సిద్ధం చేస్తు న్న హోమగుండాలు, క్యూమార్గాలు, లైటింగ్, వడ్లమన్నాటి వారి సత్రంలో ఏర్పాటు చేయనున్న అన్న ప్రసాదం, లడ్డూ తయారీ కేంద్రాలను పరిశీలించా రు. ఈనెల 18న ఉదయం 7గంటల సమయానికి సుమారు 4లక్షల లడ్డూలను సిద్ధం చేసేలా చేసిన ఏర్పాట్లు గు రించి సెక్షన్ పర్యవేక్షణాధికారి ఈవోకు వివరించారు. భవానీలు ఎన్ని లడ్డూలు అడిగినా అందించేలా ముందస్తుఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.